పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం
పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం
Published Fri, Sep 9 2016 11:48 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అర్వపల్లి : నిలువ నీడలేక అవస్థలు పడుతున్న పేద పేదకుటుంబపై ‘అభ్యాగులను ఆదుకోరూ’ అనే శీర్షికతో ‘సాక్షి’ దిన పత్రిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ స్పందించారు. మండలంలోని మాచిరెడ్డిపల్లిలో గోడ దాపున రేకు కింద దుర్భర జీవితం అనుభవిస్తున్న సట్టు నీరజ కుటుంబ పరిస్థితి ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే.. ఇందుకు స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే వారికి వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్ పులి సైదులుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం తహసీల్దార్ గ్రామానికి చేరుకుని వీఆర్వో, వీఆర్‌ఏ సహకారంతో రెండు గదుల ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వారం, పది రోజుల్లో ఇంటి పనులు పూర్తి చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఆయన వెంట ఎంఆర్‌ఐ సంద శ్రీరాములు, వీఆర్‌ఏలు కొడగంటి వెంకన్న, ఎల్లయ్య, కంచుగట్ల సరిత, పరుశరాములు, రామనర్సు, అశోక్, వెంకన్న, చింతల వీరయ్య ఉన్నారు. అదేవిధంగా ఇంటి నిర్మాణ పనులపై సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా, సాయం చేసే దాతలు 9849249936 సెల్ నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరారు.
Advertisement
Advertisement