వంద శాతం సబ్సిడీ
పాలీహౌస్‌లపై వంద శాతం సబ్సిడీ
ఎస్సీ, ఎస్టీ రైతులకు మంత్రి పోచారం హామీ
రైతులకు ఉచితంగా వెయ్యి టన్నుల గడ్డి పంపిణీ
రామాయంపేట: హార్టికల్చర్ పథకం కింద పాలీహౌస్‌ల ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామంలో రైతులు చేపట్టిన పాలీహౌస్‌లో కూరగాయల పెంపకాన్ని ఆయన పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్లలో 129 ఎకరాల్లో మాత్రమే పాలీహౌస్ ఏర్పాటు చేయగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ ైరె తులకు వం ద, బీసీలకు 90, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.
ఈ నెల 25 నుంచి మే 5 వరకు వ్యవసాయ అధికారులు ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ పేరుతో గ్రామాల్లో పర్యటించి రైతులను చైతన్యపరుస్తారన్నారు. రైతులకు ఉచితంగా వెయ్యి టన్నుల గడ్డి పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాకు 750 టన్నులు, మెదక్ జిల్లాకు 250 టన్నులు కేటాయించామన్నారు.