భార్యాభర్త... ఓ మాజీ ప్రియుడు | husband and wife A ex boyfriend | Sakshi
Sakshi News home page

భార్యాభర్త... ఓ మాజీ ప్రియుడు

Published Tue, Jun 21 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

భార్యాభర్త... ఓ మాజీ ప్రియుడు

భార్యాభర్త... ఓ మాజీ ప్రియుడు

12 ఇళ్లను దోచేశారు
అరెస్ట్ చేసిన పెద్దపల్లి పోలీసులు
రూ.10.5 లక్షల సొత్తు స్వాధీనం

 
 
 పెద్దపల్లి :  జిల్లాలోని 12 ఇళ్లలో దొంగతనాలు చేసిన భార్య, భర్త.. ఆమె మాజీ ప్రియుడిని పెద్దపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు చెందిన భార్యా భర్తలు దయ్యాల భాగ్యలక్ష్మి-శంకర్, భాగ్యలక్ష్మి మాజీ ప్రియుడు సిరిగిరి సమ్మయ్య కలిసి ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో 12 ఇళ్లలో చోరీలు చేశారు. పెద్దపల్లి సీఐ మహేష్, ఎస్సై రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ ముగ్గురినీ స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.10.5 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 210 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నల్ల మల్లారెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడిన ఈ ముగ్గురు పగలు నాలుగు ఇళ్లలో, రాత్రి రెండు ఇళల్లో దొంగతనం చేశారని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి పొద్దంతా తిరిగి తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి మాజీ ప్రియుడు, భర్తకు చెబుతుంది.

వారు రాత్రి వెళ్లి ఆ ఇళ్లలో చోరీ చేస్తారని వివరించారు. ఇదే పద్దతిలో సుల్తానాబాద్‌లో రెండు ఇళ్లను, ధర్మారంలో ఒక ఇంట్లో పగలే దొంగతనం చేశారని చెప్పారు. బసంత్‌నగర్, కరీంనగర్ రూరల్, కరీంనగర్ పట్టణంలోని మొ12 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వీరి నుంచి బంగారం స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు. దొంగలను పట్టుకుని బంగారం రికవరీ చేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement