భార్య చేతిలో భర్త హతం | Husband and wife to death | Sakshi
Sakshi News home page

భార్య చేతిలో భర్త హతం

Published Sat, Sep 10 2016 11:46 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

Husband and wife to death

నర్సింహులపేట : వివాహేతర సంబం ధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. తమకు అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తొర్రూరు సీఐ శ్రీధర్‌రావు, స్థానికుల కథనం ప్రకా రం.. కొమ్ములవంచ గ్రామానికి చెందిన డొనికేన రంగయ్య(35)కు మహబూబాబాద్‌ మండలంలోని పూసపల్లికి చెందిన విజయతో వివాహమైంది. వారికి కుమారులు రాకేష్, దినేష్‌ ఉన్నారు. విజయ కొంతకాలంగా కొమ్ములవంచ శివారు మధుతండాకు చెందిన గుగులోతు శంకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త ఆమెను మందలించడంతో ఇంట్లో గొడవలయ్యాయి. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ప్రియుడి సహకారంతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో విజయ తన కుమారులతో కలిసి కత్తితో నిద్రిస్తున్న భర్త మెడను ఇరువైపులా కోసింది. శరీరంపై అక్కడక్కడ గాట్లు పడ్డాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై మంచంలోనే మృతిచెందాడు. అయితే చుట్టుప్కకల వారికి మాత్రం రంగయ్యే మెడ కోసుకున్నాడని చెప్పి పరారయ్యారు. ఈ సంఘటన మండలంలో కలకలం సృష్టించింది. తొర్రూరు  సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై నగేష్, పీఎస్సై తిరుపతిరావు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం సిబ్బంది వేలిముద్రలు, ఇతర ఆధారాలు చేశారు. మృతుడి  అన్న రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement