
నీ వెంటే నేను..
వడదెబ్బతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య మరణం
పాన్‌గల్: ‘నీ వెంటే నేనూ.. అంటూ భర్త మరణం తట్టుకోలేక భార్య తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ మండలం పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగయ్య(66) సోమవారం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే వనపర్తి ఏరియా అసుపత్రికి, అక్కడి నుంచి జిల్లాకేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణంలో భార్య సౌభాగ్యమ్మ(62) రోదిస్తూ కుప్పకూలింది. బంధువులు పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. ఇద్దరూ ఎంతో అన్యోన్యం గా ఉండేవారని, భర్త మరణించడంతో షాక్‌తో ఆమె కూడా మరణించినట్లు బంధువులు తెలిపారు.