
'నిలువెత్తు డబ్బు పోసినా టీడీపీలో చేరను'
విజయవాడ: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఖండించారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిలువెత్తు డబ్బు పోసినా తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నాడంటూ అధికార టీడీపీ తనపై దుష్రచారం చేస్తోందంటూ కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను చివరివరకూ వైఎస్ఆర్ సీపీ లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. టీడీపీ మునిగిపోయే పడవ అని, ఆ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని ప్రతాప్ అప్పారావు వివరించారు.