
'రణదేవ్ బిల్లా'ను ఎప్పటికీ మరిచిపోలేను
తిరుమల: ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రంలో రణదేవ్ బిల్లా పాత్రను ఎన్నటికీ మరువలేనిని నటుడు దేవ్‌గిల్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు. దర్శనానంతరం దేవ్‌గిల్ మీడియాతో మాట్లాడారు. మగధీర చిత్రంతోతానుతెలుగు ప్రజలకు చాలా దగ్గరైయ్యానన్నారు.
తాను నటించిన ఓ చిత్రం హిందీ, పంజాబీ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. తిరుమల ఆలయం ముందు దేవ్‌గిల్‌ను చూసిన స్థానికులు ... ఆయనతో సెల్ఫీలు , ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.