ఆదర్శ మూర్తి మదర్‌ థెరిస్సా | Ideal person Mother Teresa | Sakshi
Sakshi News home page

ఆదర్శ మూర్తి మదర్‌ థెరిస్సా

Published Tue, Sep 20 2016 12:25 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

Ideal person Mother Teresa

  • ప్రతి ఒక్కరూ ‘సేయింట్‌ ఉడ్‌’ మార్గంలో నడవాలి
  • శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి 
  • కాజీపేట రూరల్‌ : తన సేవలతో ప్రపంచానికి మానవీయ పరిమళాలు అందించిన గొప్ప ఆదర్శ మాతృమూర్తి సేయింట్‌ ఉడ్‌ మదర్‌ థెరిస్సా అని శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రతి ఒక్కరూ మదర్‌ను ఆదర్శంగా తీసుకొని ఆమే మార్గంలో పయనించాలని కోరారు. మదర్‌ థెరిస్సాకు సేయింట్‌ ఉడ్‌ ప్రకటించిన సందర్భంగా కాజీపేట ఫాతిమానగర్‌లోని హౌస్‌ ఆఫ్‌ జాయ్‌లో సోమవారం వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేరే దేశంలో జన్మించినప్పటికీ భారతదేశం గర్వించేలా సేవలను అందించిన జగత్‌ జనని అని కొనియాడారు.
     
    ‘మై లైఫ్‌ మై మెస్సేజ్‌’ అని గాంధీజీ అన్నట్టుగా జీవితాంతం తన సేవలను మానవాళికోసం అంకితం చేసిన మదర్‌ థెరిస్సాను సేయింట్‌ ఉడ్‌గా ప్రకటించడం గర్వించతగిన విషయమని పేర్కొన్నారు. వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ వారు సైతం ఆ మాతృమూర్తి సేవలకు గుర్తింపుగా పురస్కారం ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఫౌండర్‌ సిరాజుద్దీ¯ŒS మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేయింట్‌ ఉడ్‌ ప్రదానం కార్యక్రమాన్ని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తే సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. స్పీకర్‌ మాటను పరిగణలోకి తీసుకొని మదర్‌కు సరిపడే బిరుదు కోసం చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
     
    అంతకు ముందు స్పీకర్‌ మదర్‌ థెరిస్సాకు గుర్తుగా మామిడి మొక్క నాటి దానికి మదర్‌ మ్యాంగో ట్రీ అని నామకరణం చేశారు. అనంతరం ఆయన హౌస్‌ ఆఫ్‌  జాయ్‌లోని మానసిక వికలాంగుల వివరాలను తెలుసుకొని వారి గదులను సందర్శించారు. కార్యక్రమంలో ఇ¯ŒSచార్జి బిషప్‌ ఫాదర్‌ జోసఫ్, వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ అంపశయ్య నవీ¯ŒS, జనరల్‌ సెక్రెటరీ అనీష్‌ సిద్ధికి, వైస్‌ప్రెసిడెంట్‌ ఆచార్య నర్సింహమూర్తి, ఈసీ మెంబర్లు ఆచార్య విజయబాబు, శ్రీదేవి, ఫాదర్‌ బాలశౌరి రెడ్డి, టీఎస్‌ మెస ఫిలిఫ్‌ లాజరెస్, సెక్రటరీ కౌసర్‌ ఫారుక్, రాజ్‌మోహ¯ŒS తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement