భారతదేశంలో పేదలు, రోగులు, అనారోగ్యంతో మరణానికి దగ్గరైన వారికి 1940 మధ్యకాలంలో మదర్ థెరిస్సా అందించిన సేవల నేపథ్యంలో రూపొందిన చిత్రం మదర్ థెరిస్సా అండ్ మీ. ఈ సినిమాలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ మహిళ కవిత కథను కూడా ఆవిష్కరించారు. జాక్వెలిన్ ఫిట్షి కోర్నాజ్, బనితా సంధు, దీప్తి నావెల్ ప్రధాన పాత్రలు చేశారు.
మదర్ థెరిస్సాగా జాక్వెలిన్ నటించగా, కవితగా బనితా సంధు కనిపిస్తారు. కర్రీ వెస్ట్రన్, మిలియన్స్ కెన్ వాక్ ఫేమ్ కమల్ ముసలే దర్శకత్వం వహించారు. క్రౌడ్ ఫండింగ్‌తో ఈ సినిమాను నిర్మించామని, వచ్చే లాభాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు అందిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాను తొలుత హిందీ, ఇంగ్లీష్ భాషల్లో, ఆ తర్వాత స్పానిష్‌లో డబ్ చేయాలనుకుంటున్నారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment