కోటపాడు యువకుడికి ఐఎఫ్‌ఎస్
- యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్‌ఇండియా 41వ ర్యాంకు
- ఫలితాలు ప్రకటించిన కమిషన్
శిరివెళ్ల: మండల పరిధిలోని కోటపాడుకు చెందిన మేర్వ సునీల్ కుమార్‌రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో సత్తా చాటారు. ఆల్ ఇండియా 41వ ర్యాంకు సాధించి ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)కు ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్‌లో బీటెక్ పూర్తి చేసిన సునీల్ దిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీన యూపీఎస్సీ ప్రకటించిన తుది ఫలితాల్లో (హాల్ టికెట్ నెంబర్: 0001295) ఎంపికయ్యారు.
ఐఏఎస్ సాధనే లక్ష్యం...
ఐఏఎస్ సాధనే తన లక్ష్యమని సునీల్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాడి మే 11వ తేదీన ఇంటర్యూ ఉందని, అందుకు ప్రిపేరవుతున్నట్లు తెలిపారు. యువకుని తండ్రి మేర్వ వెంకటరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా, తమ్ముడు అనిల్‌కుమార్ వరంగల్ పవర్‌గ్రిడ్‌లో ఇంజనీరుగా పనిచేస్త్ననారు. తల్లి నిర్మల బీఎస్సీ వరకు చదివి గృహిణిగా ఉంది.