అక్రమ గని! | illegal mine | Sakshi
Sakshi News home page

అక్రమ గని!

Published Tue, May 2 2017 11:48 PM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

అక్రమ గని! - Sakshi

అక్రమ గని!

– అనుమతి ఒకచోట, తవ్వేది మరొక చోట 
– చిల్లబండలో టీడీపీ నేత గ్రానైట్‌ దందా 
– బోగస్‌ ఎన్‌ఓసీ పత్రమిచ్చిన రెవెన్యూ అధికారులు 
 
కోడుమూరు: కోడుమూరు మండలంలోని చిల్లబండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేత గ్రానైట్‌ దందాను నడుపుతున్నాడు. కోడుమూరు రెవెన్యూ అధికారులతో తప్పుడు ఎన్‌ఓసీ పత్రాలు(నో–అబ్జెక‌్షన్‌ ) తీసుకుని భారీ ఎత్తున గ్రానైట్‌ తవ్వకాలు సాగిస్తున్నాడు. పేలుళ్ల దాటికి సమీపంలోని ఇళ్లపైకి, జనం మీదుకు రాళ్లు పడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. 
 
చిల్లబండ గ్రామం పక్కనే ఉన్న గ్రామనత్తం స్థలంలో అక్రమ గ్రానైట్‌ క్వారీ నడుస్తోంది. పెద్దపెద​‍్ద జేసీబీలతో దాదాపు 100 అడుగుల లోతు వరకు గోతులు తవ్వారు. 15 నుంచి 20 అడుగుల వరకు పొడవు, వెడల్పు ఉన్న గ్రానైట్‌ రాళ్లను కట్‌ చేసి తాడిపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. గ్రానైట్‌ రాళ్లను తీసేందుకు రాత్రిపూట బ్లాస్టింగ్‌ చేస్తున్నట్లు సర్పంచ్‌ మోహన్‌కాంత్‌రెడ్డి ఏప్రిల్‌ 30వ తేదీన తహసీల్దార్‌ నిత్యానందరాజుకు ఫిర్యాదు చేశారు.అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.
 
దందాకు ‘నో అబె​‍్జక‌్షన్‌’
 సోమశేఖర్‌ యాదవ్‌ అనే వ్యక్తి చిల్లబండ గ్రామంలోని 176 సర్వేనంబర్‌లో మైనింగ్‌ చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ పత్రం ఇచ్చారు. అయితే ఈ సర్వేనంబర్‌ రెవెన్యూ రికార్డుల్లో సబ్‌డివిజన్‌ అయ్యింది. సర్వేనంబర్‌ 176–ఏలో 3.88 ఎకరాలు, 176–బీలో 3.30 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉంది. మొత్తం 6.69 ఎకరాల భూమిని కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. ఇదే సర్వేనంబర్‌లో సోమశేఖర్‌యాదవ్‌కు మైనింగ్‌ చేసుకుని గ్రానైట్‌ రాళ్లను తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ  మంజూరు చేశారు. వాస్తవంగా 239 సర్వేనంబర్‌లో గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామానికి అతిసమీపంలో గ్రానైట్‌ తవ్వుకునేందుకు అనుమతులివ్వడం ఇబ్బందవుతుందన్న కారణాలతోనే రెవెన్యూ అధికారులు బోగస్‌ సర్వేనంబర్ల ఆధారంగా అతడికి  నో–అబ్జెక‌్షన్‌ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిసింది. 
 
రాత్రిపూట పేలుళ్లు :
చిల్లబండ గ్రామం అతిసమీపంలోనే పేలుడు పదార్థాలతో తయారుచేసిన జిలెటిన్‌ స్టిక్స్‌ అమర్చి భారీఎత్తున రాత్రిపూట రాళ్లను పగులగొడుతున్నారు. పేలుళ్ల దాటికి ఇళ్లపైకి, జనంమీదుకు రాళ్లు పడుతున్నాయి. పేలుళ్ల శబ్ధానికి ఇళ్లు పగుల్లిస్తున్నాయి. ఎదురు తిరిగిన జనంపై గ్రానైట్‌ యజమాని తన అనుచరులచేత దాడులు చేయిస్తున్నాడని సర్పంచ్‌ మోహన్‌కాంతారెడ్డి ఆరోపించారు. 
రాత్రిపూట రవాణా : 
చిల్లబండ గ్రామంలోని క్వారీ ద్వారా తీసిన గ్రానైట్‌ రాళ్లను పెద్ద లారీల్లో తాడిపత్రికి రాత్రిపూట తరలిస్తున్నాడు. రాయల్టీ పత్రాలు సక్రమంగా ఉంటే రాత్రిపూట ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరగని గ్రానైట్‌ క్వారీలకు సంబంధించి రాయల్టీ పత్రాలు తీసుకుని చిల్లబండ క్వారీ రాళ్లను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా సాగిస్తున్న ఈ దందాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు సమాచారం.
 
ఆ సర్వేనంబర్‌ రెవెన్యూ రికార్డుల్లో లేదు : నిత్యానందరాజు, తహశీల్దార్‌ 
చిల్లబండ గ్రామంలో మైనింగ్‌ చేసుకునేందుకు 176 సర్వేనంబర్‌ ఆధారంగా గతంలో పనిచేసిన అధికారులు ఎన్‌ఓసీ ఇచ్చారు. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఆ సర్వేనంబర్‌ సబ్‌డివిజన్‌ అయ్యింది. 6.69 ఎకరాల విస్తీర్ణంలో 176/ఎ, 176/బి సర్వేనంబర్లలో రైతులు ఆ పొలాన్ని సాగుచేసుకుంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement