ruling party leader
-
దేవుడి ముసుగులో.. పర్యాటక స్థలం ఆక్రమణ
పూసపాటిరేగ: ఆడ పిల్ల.. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా దీనినే అనుసరిస్తున్నారు. ఆక్రమించేందుకు ఏదైతే ఏం అన్న రీతిలో బరితెగిస్తున్నారు. చింతపల్లి సముద్రతీరంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పర్యాటక స్థలానికి నిర్మించి ఆక్రమించాడు. తొలుత పర్యాటక స్థలానికి ఆనుకొని గుడితో పాటు ప్రహరీ కూడా నిర్మించాడు. ఆ తరువాత పర్యాటకంగా ఆ ప్రదేశం అంతా అభివృద్ధి చెందడంతో గుడి చుట్టూ ఉన్న సుమారు 50 సెంట్లు స్థలంపై ఆయన కన్నుపడింది. వెంటనే స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు కూడా ఎత్తేశాడు. చింతపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 115లో వున్న పర్యాటక శాఖ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలోనే ప్రహరీ నిర్మించాడు. ఈ నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా పర్యాటక శాఖ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే నిర్మాణాలు జరిగా యా అని చర్చించుకొంటున్నారు. చింతపల్లి బీచ్‌కు వచ్చే పర్యాటకులు వాహనాలు పార్కింగ్‌కు ఉంచే స్థలంలో ని ర్మాణాల జరిగినా పట్టించుకోవడం లేదు. చింతపల్లి పం చాయతీలో అధికార పార్టీకి చెందిన కీలకనేత కావడంతో ప్రజలు అడిగే సాహసం చేయలేపోతున్నారు. పర్యాటకశాఖ అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లం అవడంతో కన్ను పడిందే తడువుగా స్థలాన్ని కబ్జా చేశారు. విచారణ ఆదేశించాలని మత్స్యకార నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు నోరు మెదపలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యాటకశాఖకు చెందిన స్థలాన్ని అధికారపార్టీ నాయకుడు నుంచి కాపాడాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ రామారావును వివరణ కోరగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి చింతపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకశాఖ స్థలాన్ని కబ్జాచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలి. – ఎం.శ్రీనువాసురావు, సామాజిక కార్యకర్త పర్యాటక భవనాలు ప్రారంభించాలి సుమారు కోటి రుపాయల నిధులతో నిర్మించిన పర్యాటక భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి టూరిజం భవనాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి. – మహంతి జనార్దనరావు, పూసపాటిరేగ -
చీకటి దందా !
మొరం దందా కొత్త పుంతలు తొక్కుతోంది. కాసులకు మరిగిన మొరం మాఫియా అక్రమ రవాణాకు కొత్తదారులు వెతుకుతోంది. పగటి పూట కాకుండా.. అర్ధరాత్రి వేళల్లో మొరం రవాణాకు తెరలేపారు. చీకటి పడితే చాలు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : రెవెన్యూ అధికారుల బృందం శుక్రవారం అర్ధరాత్రి మోపాల్ మండలం కంజర్ శివారులో నిర్వహిస్తున్న అనుమతి లేని క్వారీ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొరం తరలించేందుకు వచ్చి న తొమ్మిది టిప్పర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించిన అక్రమార్కులు మిగిలిన టిప్పర్లను దారి మళ్లించారు. ఈ దందాకు అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరుడు సూత్రధా రి అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పలుచోట్ల తవ్వకాలు.. మోపాల్‌తో పాటు, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, ఎడపల్లి తదితర మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో భూగర్భాన్ని తొలిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టిన తవ్వకాలతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. పట్టా, ప్రభుత్వ భూములు తేడాలేకుండా విచ్చలవిడిగా తవ్వకాలను చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం మొరం తవ్వకాలు జరపాలంటే భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. నిర్దేశిత మొత్తంలో సీనరేజీ చెల్లించి మొరాన్ని తరలించాలి. ఇవేవీ పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లడమే కాకుండా, భూగర్భ గనులశాఖకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లో వాణిజ్య అవసరాలకు మొరం డిమాండ్ అధికంగా ఉంది. ఒక్కో టిప్పరుకు రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు విక్రయిస్తున్నారు. నగరంలో రియల్ వెంచర్లకు, ప్రైవేటు కట్టడాలకు ఈ మొరాన్ని తరలిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలే లేవు.. అక్రమ మొరం తవ్వకాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అడపాదడపా టిప్పర్లను పట్టుకుని నామమాత్ర జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. కానీ మొరం తవ్వుతున్న ప్రదేశాలకు వెళ్లి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి. ఎంత పరిమాణంలో మొరాన్ని తరలించారు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన జరిమానాలు విధించాల్సి ఉంది. అలాగే కేసులు నమోదు చేసి మొరం తవ్వుతున్న జేసీబీలను, తరలిస్తున్న టిప్పర్లను కోర్టుకు అప్పగిస్తే.. అక్రమ దందాకు చెక్పడే అవకాశాలుంటాయి. అయితే నామమాత్ర జరిమానా విధించి వాహనాన్ని వదిలేయడం వల్ల మళ్లీ యథేచ్ఛగా ఈ అక్రమ దందాకు ఆస్కారం ఏర్పడుతోంది. తొమ్మిది టిప్పర్లు పట్టివేత మోపాల్(నిజామాబాద్ రూరల్): మోపాల్ మండలంలో మొరం అక్రమ దందాపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కంజర్ గ్రామశివారులో శుక్రవారం అర్ధరాత్రి మాటు వేసి క్వారీ వద్ద తొమ్మిది టిప్పర్లను పట్టుకున్నారు. వీరిని పసిగట్టిన మరో ఐదు టిప్పర్లు తప్పించుకుపోయాయి. అనుమతుల్లేకుండా మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను గతంలోనూ పట్టుకున్నప్పటికీ నామమాత్రపు జరిమానాలు విధించడంతో తిరిగి తమ దందాను కొనసాగిస్తున్నారు. ఒకటి, రెండు టిప్పర్లు కాకుండా సుమారు 15 టిప్పర్ల ద్వారా మొరం రవాణా చేస్తుండటంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా అధికారులు అర్ధరాత్రి దాడులు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడిలో ఆర్ఐ నారాయణ, ఎస్ఐ సతీశ్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, వీఆర్వోలు ఇంతియాజ్, రఫీక్, సంజీవ్, పృథ్వీ, వీఆర్ఏలు ఉన్నారు. -
దర్జాగా కబ్జా
► అధికార పార్టీ నేత అనుచరుడి భూ ఆక్రమణ ► అక్రమంగా ఆన్లైన్లో పేర్లు మార్చిన వైనం ► తహసీల్దార్‌ను ఆశ్రయించిన బాధిత రైతులు రుద్రవరం (కర్నూలు సీక్యాంప్ ): దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇద్దరు నిరు పేదలు సాగు చేసుకుంటున్న భూములు తమవి అంటూ రాత్రికి రాత్రే కబ్జా చేశాడు ఓ అధికారి పార్టీ నేత అనుచరుడు. అధికారుల అండతో ఆన్లైన్లో పేరు మార్చి దర్జాగా కబ్జాకు పాల్పడ్డాడు. కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం సర్వే నంబర్లో 474–1లో 2 ఎకరాలు, 473–2ఎలో 2.50 ఎకరాలను రుద్రవరం గ్రామానికి చెందిన మాదిగ పక్కీరన్న, మాదిగ నరసింహులు పెద్దల ఆస్తిగా సాగు చేసుకుంటున్నారు. ఈ పొలాలకు వారి పేరు మీద పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇటీవల అధికార పార్టీ నేత అనుచరుడు శ్రీనివాసరెడ్డి రైతు నరసింహులు పొలంలో ఎకరా 18 సెంట్లు, పక్కీరన్న పొలంలో 25 సెంట్లు తన పేరు మీద ఆన్లైన్లో పేరు మార్పించాడు. పేదల భూములు శ్రీనివాసరెడ్డికి ఆన్లైన్ కావడంలో వీఆర్వో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దాదాపు రూ.2 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కేసీ కెనాల్ నష్టపరిహారం వస్తుందని పథకం ప్రకారం రెండు నెలలు క్రితం పక్కీరయ్య పొలం పాస్‌పుస్తకాలను వీఆర్ఓ తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ సమయంలో ఆన్లైన్లో శ్రీనివాస్‌రెడ్డి పేరును వీఆర్వో దగ్గరుండి నమోదు చేయించాడని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల శ్రీనివాసరెడ్డి పీఏ రైతుల దగ్గరకు వచ్చి ఆ స్థలం తమ యజమానిదని, ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. ఉలిక్కిపడిన రైతులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఆన్లైన్ పరిశీలించగా వారి సర్వేనెంబర్లు 474–1 , 473–2ఎ కొంత భూమి శ్రీనివాసులు రెడ్డి పేరు మీద నమోదు కావడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం ఈ స్థలంలో శ్రీనివాసరెడ్డి ట్రిప్పర్లు, లారీలను ఉంచాడు. ఈ మేరకు బాధిత రైతులు తహసీల్దార్ టీవీ.రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితుల వాదన విన్న తహసీల్దార్ ఆర్ఐతో విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నగర శివారుపై అధికార నేత చూపు: అధికార పార్టీ నేత చూపు నగర శివారు ప్రాంతాలైన బి.తాండ్రపాడు, మునగాలపాడు, పసుపల, రుద్రవరం, నందనపల్లె వంటి ప్రాంతాలపై పడింది. లిటిగేషన్ భూములు కనిపిస్తే చాలు తన అనుచరులను అక్కడ దింపి భూములను కబ్జాకు గురిచేస్తున్నారు. ఎవరైన అడ్డవస్తే ఏదో కొంత ముట్ట జెప్పడం, తమ మాట వినని వాళ్లను అధికారంతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండతో ఈ వ్యవహారం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇక శివారు భూములను దర్జాగా కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుంటాం: ఈ పొలం మా తాతలు, తండ్రుల కాలం నుంచి మాకు సంక్రమించింది. మేము అమ్మకుండానే వేరే వాళ్లకు ఆన్లైన్లో పొలం ఎలా వెళుతుంది. మా పొలం మేము ఎవ్వరికి అమ్మలేదు. మా పొలం మాకు దక్కకపోతే కలెక్టర్ ఎదుట మా కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. -మాదిగ పక్కీరయ్య, నరసింహులు -
అక్రమ గని!
– అనుమతి ఒకచోట, తవ్వేది మరొక చోట – చిల్లబండలో టీడీపీ నేత గ్రానైట్ దందా – బోగస్ ఎన్ఓసీ పత్రమిచ్చిన రెవెన్యూ అధికారులు కోడుమూరు: కోడుమూరు మండలంలోని చిల్లబండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేత గ్రానైట్ దందాను నడుపుతున్నాడు. కోడుమూరు రెవెన్యూ అధికారులతో తప్పుడు ఎన్ఓసీ పత్రాలు(నో–అబ్జెక్షన్ ) తీసుకుని భారీ ఎత్తున గ్రానైట్ తవ్వకాలు సాగిస్తున్నాడు. పేలుళ్ల దాటికి సమీపంలోని ఇళ్లపైకి, జనం మీదుకు రాళ్లు పడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చిల్లబండ గ్రామం పక్కనే ఉన్న గ్రామనత్తం స్థలంలో అక్రమ గ్రానైట్ క్వారీ నడుస్తోంది. పెద్దపెద్ద జేసీబీలతో దాదాపు 100 అడుగుల లోతు వరకు గోతులు తవ్వారు. 15 నుంచి 20 అడుగుల వరకు పొడవు, వెడల్పు ఉన్న గ్రానైట్ రాళ్లను కట్ చేసి తాడిపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. గ్రానైట్ రాళ్లను తీసేందుకు రాత్రిపూట బ్లాస్టింగ్ చేస్తున్నట్లు సర్పంచ్ మోహన్కాంత్రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన తహసీల్దార్ నిత్యానందరాజుకు ఫిర్యాదు చేశారు.అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. దందాకు ‘నో అబె్జక్షన్’ సోమశేఖర్ యాదవ్ అనే వ్యక్తి చిల్లబండ గ్రామంలోని 176 సర్వేనంబర్‌లో మైనింగ్ చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ పత్రం ఇచ్చారు. అయితే ఈ సర్వేనంబర్ రెవెన్యూ రికార్డుల్లో సబ్‌డివిజన్ అయ్యింది. సర్వేనంబర్ 176–ఏలో 3.88 ఎకరాలు, 176–బీలో 3.30 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉంది. మొత్తం 6.69 ఎకరాల భూమిని కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. ఇదే సర్వేనంబర్‌లో సోమశేఖర్యాదవ్కు మైనింగ్ చేసుకుని గ్రానైట్ రాళ్లను తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ మంజూరు చేశారు. వాస్తవంగా 239 సర్వేనంబర్‌లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామానికి అతిసమీపంలో గ్రానైట్ తవ్వుకునేందుకు అనుమతులివ్వడం ఇబ్బందవుతుందన్న కారణాలతోనే రెవెన్యూ అధికారులు బోగస్ సర్వేనంబర్ల ఆధారంగా అతడికి నో–అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిసింది. రాత్రిపూట పేలుళ్లు : చిల్లబండ గ్రామం అతిసమీపంలోనే పేలుడు పదార్థాలతో తయారుచేసిన జిలెటిన్ స్టిక్స్ అమర్చి భారీఎత్తున రాత్రిపూట రాళ్లను పగులగొడుతున్నారు. పేలుళ్ల దాటికి ఇళ్లపైకి, జనంమీదుకు రాళ్లు పడుతున్నాయి. పేలుళ్ల శబ్ధానికి ఇళ్లు పగుల్లిస్తున్నాయి. ఎదురు తిరిగిన జనంపై గ్రానైట్ యజమాని తన అనుచరులచేత దాడులు చేయిస్తున్నాడని సర్పంచ్ మోహన్కాంతారెడ్డి ఆరోపించారు. రాత్రిపూట రవాణా : చిల్లబండ గ్రామంలోని క్వారీ ద్వారా తీసిన గ్రానైట్ రాళ్లను పెద్ద లారీల్లో తాడిపత్రికి రాత్రిపూట తరలిస్తున్నాడు. రాయల్టీ పత్రాలు సక్రమంగా ఉంటే రాత్రిపూట ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరగని గ్రానైట్ క్వారీలకు సంబంధించి రాయల్టీ పత్రాలు తీసుకుని చిల్లబండ క్వారీ రాళ్లను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా సాగిస్తున్న ఈ దందాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు సమాచారం. ఆ సర్వేనంబర్ రెవెన్యూ రికార్డుల్లో లేదు : నిత్యానందరాజు, తహశీల్దార్ చిల్లబండ గ్రామంలో మైనింగ్ చేసుకునేందుకు 176 సర్వేనంబర్ ఆధారంగా గతంలో పనిచేసిన అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఆ సర్వేనంబర్ సబ్‌డివిజన్ అయ్యింది. 6.69 ఎకరాల విస్తీర్ణంలో 176/ఎ, 176/బి సర్వేనంబర్లలో రైతులు ఆ పొలాన్ని సాగుచేసుకుంటున్నారు. -
కత్తి కట్టిన కో‘ఢీ’
వందల కోట్లు చేతులు మారిన వైనం సాక్షి నెట్వర్క్: అధికార పార్టీ అండ, పోలీసుల ఉత్తుత్తి ఆంక్షలతో కోర్టు నిషేధం నీరుగారి పోయింది. సంక్రాంతి సంప్రదాయం పేరిట పందెంరాయుళ్లు పేట్రేగి పోయారు. కోడి జూలు విదిల్చింది. కత్తి కట్టి మరీ కాలు దువ్వింది. చాలాచోట్ల అధికార పార్టీ నేతలే పందాలకు నేతృత్వం వహించి ప్రారంభించారు. బరుల వద్ద వెలసిన శిబిరాల్లో జూదం జోరుగా సాగింది. మద్యం ఏరులై పారింది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదు చేతులు మారింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే భోగి నుంచి మొదలుకుని మూడురోజుల్లో రూ.200 కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో ఆదివారం రాత్రి కూడా కోడిపందేలు కొనసాగాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఈ నెల 13 నుంచి 25 వ తేదీ వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. ఈ హెచ్చరికలేవీ పందేలకు వందలాదిగా తరలివచ్చినవారిని ఆపలేకపోయాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పందేలకు అనుమతి ఇవ్వక పోవడంతో అక్కడి నుంచి జూదరులు జిల్లాకు భారీగా తరలివచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఏడాది కోడి పందేలు నిర్వహించడం గమనార్హం. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కోడిపందేల్లో పాల్గొంటే.. ఆయన తమ్ముడు, ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో కోడి పందేలను ప్రారంభించారు. ఉత్సాహంగా జల్లికట్టు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో పశువుల పండుగ (జల్లికట్టు)ను అత్యంత వైభవంగా నిర్వహించారు. జల్లికట్టులో దూసుకువస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీపడ్డారు. -
విస్తరణ.. మలుపు!
రోడ్డు వెడల్పు పనుల్లో అడ్డంకి – టీడీపీ నేత భవంతి విషయంలో ఆచితూచి – అనుమతి లేకున్నా అక్రమ కట్టడం – విస్తరణ పనుల కంటే ముందుగానే నిర్మాణం – చేష్టలుడిగి చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం – నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రోడ్డు వెడల్పు పనుల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రై వేటు స్థలాలను అడ్డంగా కొట్టేసిన కార్పొరేషన్ అధికారులు.. సరిగ్గా రోడ్డు వెడల్పు పనులు అవసరమైన చోట అధికార పార్టీ నేత భవంతి ఉందనే కారణంగా నెమ్మదించారు. పైగా రోడ్డు నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే 10 అడుగుల స్థలం ఇచ్చేశానని చెబుతూ.. కనీసం అనుమతి తీసుకోకుండానే నిర్మాణాలు కూడా చేపట్టారు. అంతేకాదు.. ఈ భవంతి కోసం ఏకంగా రోడ్ల వెడల్పు పనులను కూడా నెమ్మదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాల పనుల్లో జలమండలి నుంచి రైల్వే స్టేషన్ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల్లో సాగుతున్న తతంగం ఇదీ. వాస్తవానికి రైల్వే స్టేషన్‌కు సరిగ్గా ఎదుటనున్న ఈ భవంతి వద్ద రోడ్డు వెడల్పు చేయకపోతే మొత్తం రోడ్ల విస్తరణ పనులకే అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే సరిగ్గా ఇక్కడే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ భవంతిని కూల్చకుండా.. 10 అడుగుల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చాడనే పేరుతో కనీసం అనుమతి లేకుండా నిర్మాణం సాగిస్తున్నా కార్పొరేషన్ అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇందుకు ఆయన అధికార పార్టీ నేత కావడమే కారణమని తెలుస్తోంది. హడావుడి పనులు వాస్తవానికి కృష్ణా పుష్కరాలల్లో భాగంగా కర్నూలు కార్పొరేషన్లో అనేక పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కోటి రూపాయలకు పైగా వ్యయంతో ఐదు రోడ్ల కూడలి(జలమండలి) నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు, డివైడర్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచారు. ఈ పనులను అధికార పార్టీ నేత చేజిక్కించుకున్నారు. మొదట్లో జెట్ స్పీడుతో పనులు సాగాయి. పుష్కరాల్లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి కాస్తా కాకపోవడంతో ఇప్పుడు పనులు నెమ్మదించాయి. ఇందులోనూ మొదట్లో ఇటు జలమండలి కార్యాలయం, అదనపు ఎస్పీ కార్యాలయం వంటి ప్రభుత్వ స్థలాలతో పాటు కేవీఆర్ కాలేజీకి చెందిన ప్రహరీ గోడను కూడా అంతే వేగంగా కూల్చివేశారు. అయితే, అధికార పార్టీ నేత భవనం జోలికి మాత్రం పోకుండా జాగ్రత్తపడ్డారు. అక్కడికొచ్చే సరికి.. పుష్కరాల్లో భాగంగా చేపట్టిన ఈ పనులు మొదట్లో వేగంగా చేపట్టారు. తీరా అధికార పార్టీకి చెందిన నేత భవంతి రావడంతో పనులు నెమ్మదించాయి. సరిగ్గా ఈ భవనానికి ఎదురుగా ఉన్న షాపులను కూల్చివేసిన అధికారులు ఈ భవనం జోలికి మాత్రం పోలేదు. తీరిగ్గా కోర్టుకు వెళ్లి పద్ధతి ప్రకారం(డ్యూ ప్రాసెస్) రోడ్ల వెడల్పు చేపట్టాలని ఆదేశాలు తెచ్చే వరకూ అధికారులు ఆగారు. తీరా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీ భవంతిని కూలుస్తామని నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించిన సదరు అధికార పార్టీ నేత, భవన యజమాని టైటిల్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) కింద 10 అడుగుల స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. అయితే, దీనిపై ఇంకా కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ కూడా చేయలేదు. ఇవేవీ జరగకుండా కనీసం అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు మాత్రం చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జనం సొమ్ముకు..పచ్చ టెండర్!
⇔ కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నేత కుమ్మక్కు ⇔ టెండర్లు లేకుండానే రూ.18 లక్షల పనులు ⇔ 60 శాతం పనులు అయిపోయిన తర్వాత టెండర్లకు ఆహ్వానం ⇔ గతంలోనూ టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల పనులు ⇔ ఒంగోలు నగరపాలక సంస్థలో వింత పోకడ ⇔ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ⇔ అరుునా యథేచ్ఛగా అక్రమాలు ⇔ ప్రజల సొమ్ము టీడీపీ నేతల పాలు ⇔ కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పనులు చేపట్టడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ నేతలు, కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కై ముందు పనులు చేయించి ఆ తర్వాత టెండర్లు పిలుస్తూ వింత పోకడకు తెరలేపారు. కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకొని ప్రజాధనానికి గండి కొడుతున్నారు. గతంలోనూ కోట్లాది రూపాయల పనులకు సంబంధించి ఇదే తీరు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నా మున్సిపల్ అధికారులు, టీడీపీ నేతలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపి అందినకాడికి దండుకుంటున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. చక్రం తిప్పిన షాడో ఎమ్మెల్యే.. ఒంగోలు నగరంలోని రామ్‌నగర్ 6 నుంచి 7వ లైను వరకు, 7వ లైను నుంచి 8వ లైను వరకు గ్రీన్‌బెల్టు పేరుతో కార్పొరేషన్ అభివృద్ధి పనులు చేపట్టింది. 6వ లైను పనుల కోసం రూ.8,46,494/-, 7వ లైను పనుల కోసం రూ.9,24,296/- కేటాయించారు. మొత్తంగా రెండు పనుల కోసం రూ.17,70,790/- కేటాయించారు. ఈ మొత్తం నగరపాలక సంస్థసాధారణ నిధుల నుండి కేటాయిస్తారు. గ్రీన్‌బెల్టులో భాగంగా రెండు రోడ్ల మధ్య మొక్కలు, గ్రీనరీ పెంచాల్సి ఉంది. దీనికి రక్షణగా ఇరువైపుల 6 అడుగుల ఎత్తున ఐరన్ పోల్స్‌ను ఏర్పాటు చేసి, ఐరన్ బాలీ (ఫెన్సింగ్)ను నిర్మించాల్సి ఉంది. ఈ పనుల కోసం మున్సిపల్ అధికారులు ఈ నెల 2న పేరుకు టెండర్లు పిలిచారు. 14వ తేదీన టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే నగరానికి చెందిన అధికార పార్టీ నేత ఆదేశం మేరకు ఆ పనులను ఆయన ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీకి అప్పగించారు. కమిటీలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించే అనుచరుడు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా జోరుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ అధికారులు టెండర్లు మాత్రం తెరవలేదు. పేరుకు టెండర్లు నిర్వహించి టెండర్ ఓపెన్ చేయకుండానే కాంట్రాక్టర్‌తో పనులు చేయించడం చూస్తే కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. రెండు పనులకు సంబంధించి దాదాపు రూ.18 లక్షలు కేటాయించారు. టెండర్లలో పోటీ నిర్వహించి ఉంటే 20 శాతం తక్కువకు పనులు ఖరారు అయ్యేవి. ఈ లెక్కన దాదాపు రూ.4 లక్షలు ప్రజాధనం మిగిలేది. టెండర్లకు పోటీకి వచ్చే కాంట్రాక్టర్లను ఇప్పటికే ఆ పనులను వేరే కాంట్రాక్టర్లకు అప్పగించామని మీరు పోటీలో పాల్గొనవద్దని, కాదని పాల్గొంటే ఇబ్బందులు పడతారంటూ ఇంజినీరింగ్ విభాగం అధికారులే బెదిరించడం గమనార్హం. ముఖ్యనేత ఆదేశాలతో అక్రమాల వెల్లువ.. నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత ఆదేశాల మేరకు కార్పొరేషన్ అక్రమాలకు అడ్డేలేకుండా పోతుందన్న విమర్శలున్నాయి. ముఖ్యనేత (ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీ) నగరపాలక సంస్థ కార్యాలయూల్లో మకాం వేసి అధికారులను శాసిస్తున్నారు. తాము చెప్పినట్టే నిధులు ఖర్చు చేయాలంటూ, తాను నిర్దేశించిన పనులనే చేపట్టాలంటూ శాసిస్తున్నారు. టెండర్లు లేకుండానే పనులు చేయిస్తున్నారు. కాదు, కూడదంటే బదిలీ చేసుకొని వెళ్లిపోమ్మని అధికారులతో బెదిరిస్తున్నారు. దోచుకుంటున్న నిధుల్లో పచ్చ నేతలకు 8 శాతం, అధికారులకు 4 శాతం వాటాగా పంచుకుంటున్నట్లు కొందరు మున్సిపల్ అధికారులే చెబుతుండటం గమనార్హం. గతంలోనూ ఇదే తీరు.. టెండర్లు ఖరారు కాకుండానే ముందుగా పనులను చేయించడం ఒంగోలు మున్సిపాలిటీలో ఆనవాయితీగా మారింది. గతంలో బాలకృష్ణాపురంలో రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణం, గాంధీపార్కులో విద్యుత్ స్తంభాలు, బల్బుల ఏర్పాటు, కమ్మపాలెం స్మశానవాటిక ప్రహరీగోడ నిర్మాణం పనులు సైతం ముందుగా చేయించి తర్వాత టెండర్లు ఖరారు చేశారు. టెండర్లు లేకుండానే కోట్లాది రూపాయల పనులు గుట్టుచప్పుడు లేకుండానే నిర్వహించారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్.. ఒంగోలు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండాపోతోంది. విలువైన మున్సిపల్ స్థలాలను కూలగొట్టి అధికార పార్టీ నేతలకు ధారాదత్తం చేస్తున్నారు. మరో వైపు బండ్లమిట్ట, పోతురాజుకాలువ ప్రాంతాల్లో పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసి ఆ స్థలాలను సైతం అధికార పార్టీ నేతలకు అప్పగించే ప్రయత్నానికి దిగినా.. పాలనాధికారి మిన్నకుండిపోయారన్న విమర్శలున్నాయి. దీంతో పాటు టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల పనులు నిర్వహిస్తూ అధికారులు, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నా ఉన్నతాధికారి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలున్నాయి. -
అక్షరాలా... రూ.కోటి విలువైన స్థలాల కబ్జా
అధికార పార్టీ నేత దందా! చోద్యం చూస్తున్న అధికారులు ఫిర్యాదులపై స్పందించని వైనం శ్రీకాకుళం మున్సిపాలిటీ సరిహద్దు గ్రామం తోటపాలెం. ఇక్కడ సెంటు భూమి విలువ సుమారు 3లక్షలు ఉంటుంది. అంటే ఎకరా అక్షరాలా రూ.3కోట్లు అన్న మాట. దీంతో ప్రభుత్వ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నిర్ణయించారు. ఇంకేముంది..ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రహరీలూ నిర్మించేస్తున్నారు. సర్వే నంబర్లు మార్చి మరి తమ బంధువుల పేరిట పట్టాలు సృష్టించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. కొందరు అధికారులైతే అధికార పార్టీ నేతలకు దన్నుగా నిలబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఎచ్చెర్ల :తోటపాలెంలో రెండు చోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. పొన్నాడ వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 264-3లో 31 సెంట్లు ఆక్రమణకు గురవుతుంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా ఆక్రమణ చేసి అధికార పార్టీకి చెందిన ఓ నేత కబ్జా కొనసాగిస్తున్నాడు. ఈ స్థలంలో ఉన్న రాతి బండలు తొలగించి చదును చేశాడు. ప్రహరీ నిర్మాణం సైతం దాదాపుగా పూర్తి చేశాడు. మరోవైపు ఇదే పంచాయతీ కొత్తపేట రోడ్డుకు ఆనుకొని 20 సెంట్లు ప్రభుత్వ స్థలం చుట్టూ స్తంభాలు పాతేశాడు. ఈ భూమిని తన బంధువు పేరిట పట్టా చేరుుంచుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ రెండు స్థలాల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా. ఇదంతా ఒక ఎత్తై కబ్జా స్థలాలను వేరే వ్యక్తులకు సైతం విక్రయించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది. ఫిర్యాదుపై స్పందనేదీ? ఈ ఆక్రమణలపై గ్రామ సర్పంచ్ కడుపు శేఖర్‌రావు, మాజీ సర్పంచ్ కళ్లేపల్లి తిరుపతిరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంత్రి మోహనరావు తదితరులు ఫిబ్రవరి 10న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జిల్లా ల్యాండ్ అండ్ సర్వే విభాగం సర్వేయర్లు 15, 16 తేదీల్లో సర్వే నిర్వహించారు. ఫిర్యాదుదారులు ఆక్రమణలను వివరించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. సర్వే నిర్వహించిన అధికారులు కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు... సర్పంచ్, మాజీ సర్పంచ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. రికార్డులు, సర్వే నంబర్లు అన్నీ పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ స్థలంగా నిర్ధారణ అయితే స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే సర్వే అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -బందర వెంకటరావు, తహశీల్దార్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి... ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. అధికార పార్టీ నాయకుడు గ్రామంలో అన్ని ప్రభుత్వ స్థలాలపై కన్నేశాడు. భూములు అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలి. -కడుపు శేఖరరావు, సర్పంచ్, తోటపాలెం -
బేరం కుదిరింది!
► మద్యం మాఫియా, ► ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం ► సయోధ్య కుదిర్చిన అధికార పార్టీ నేత ► పెరిగిన మద్యం ధరలు ► సాక్షి-సాక్షి టీవీ జాయింట్ ఆపరేషన్‌లో వెల్లడి సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మద్యం సిండికేట్ హవా మళ్లీ మొదలైంది. ఉన్నతాధికారుల మధ్య విభేదాలు సద్దుమణగడంతో బాటిల్ ధర పెరిగింది. బాటిల్‌పై రూ.5 పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అటు మద్యం సిండికేట్‌కు, ఇటు అధికారులకు మధ్య అంగీకారం నేపథ్యంలోనూ బాటిల్ ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం షాపుల యజమానులు అందరూ కలిసి ధర పెంచినట్టు స్వయంగా షాపులో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. సాక్షి- సాక్షి టీవీ నిఘాలో ఈ అంశం స్పష్టంగా వెల్లడయ్యింది. మొన్నటివరకు ధర పెంచుకునేందుకు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు అడ్డొచ్చాయి. అధికార పార్టీ నేతలు సర్దిచెప్పడంతో బేరం కుదిరి... బాటిల్ ధర పెరిగింది. జిల్లావ్యాప్తంగానూ ఇదే తీరు జిల్లావ్యాప్తంగా మద్యం సిండికేట్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్లలో ఏకంగా బాటిల్‌పై రూ. 10 పెంచి మరీ విక్రయిస్తున్నారు. అక్కడి అధికార పార్టీ నేతల అండదండలతో దీనికి అడ్డులేకుండా పోయింది. తాజాగా కర్నూలులో బాటిల్‌పై రూ. 5 పెంచుకునేందుకు మొదట్లో జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలతో రచ్చ అయ్యింది. ఏకంగా ఒక షాపును మరో అధికారి పట్టించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత సోదరుడు రంగప్రవేశం చేసి..సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా బాటిల్‌పై రూ.5 పెరిగింది. ఎంఆర్పీ ఉల్లంఘన షురూ అయ్యింది. మరోవైపు సీజ్ అయిన షాపునకు వేసిన పెనాల్టీని..మద్యం సిండికేట్లు అందరూ కలిసి కట్టినట్టు సమాచారం. ఫలితంగా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చి షాపును సీజ్ చేసినప్పటికీ కేవలం పెనాల్టీతో సరిపుచ్చుకుని.. షాపు యథావిధిగాా ప్రారంభమయ్యింది. విచిత్రమేమిటంటే.. ఈ షాపులో కూడా యథావిధిగా ఎంఆర్పీ ఉల్లంఘన జరగడం. సాక్షి నిఘాతో బట్టబయలు మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు సాక్షి-సాక్షి టీవీ నిఘా పెట్టింది. జిల్లాలో పలు షాపులను బుధవారం రాత్రి సాక్షి బృందం స్వయంగా వెళ్లి బాటిల్ ధర ఎంత అంటూ వాకబు చేసింది. ఈ సందర్భంగా యజమానులందరూ కలిసి ధర పెంచారని షాపులో పనిచేస్తున్న సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఒక షాపులో పనిచేసే సిబ్బంది ఏకంగా ధరలు పెంచకపోతే ఓనర్ కథ ముగుస్తుందంటూ మాట్లాడటం గమనార్హం. ‘సాక్షి’ టీంకు, మద్యం షాపు సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ.. షాపు నెంబరు 1: సాక్షి: రాయల్ స్టాగ్ క్వార్టర్ ఎంత అన్న? షాపు బాయ్: రూ. 155 అన్న. సాక్షి: ఎంఆర్పీ ఎంత అన్న బాయ్: రూ. 150. సాక్షి: ఎందుకు రూ. 5 ఎక్కువన్న. ఎవరు డిసైడ్ చేశారు. బాయ్: ఎక్సైజ్ వాళ్లు, సిండికేట్ వాళ్లు....వైన్‌షాపు ఓనర్స్ అందరూ మాట్లాడుకుని బాటిల్‌పై రూ.5 పెంచినారు. షాపు నెంబరు 2: సాక్షి: రాయల్ స్టాగ్ హాఫ్ ఎంత? బాయ్: రూ. 310 అన్న. ఎంఆర్పీ కన్న ఎక్కువ. సాక్షి: ధర ఎవరు పెంచారు. బాయ్: ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మాదేమీ ఇది సొంత షాపు కాదు. మేం పనిచేసే వాళ్లమే. ఏదైనా రూ. 5 ఎక్కువే. -
టీడీపీ స్పెష‘లిస్టు’
వైద్యాధికారి పోస్టుల భర్తీకి ఒత్తిళ్లు తాము చెప్పినవారినే ఓకే చేయాలని అధికార పార్టీ నేత ఆదేశాలు వికలాంగుల పోస్టింగ్లకూ పైరవీ కలెక్టరేటులో మకాం వేసిన ‘అధికార’ అనుచరులు జాబితా విడుదలలో జాప్యం శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకానికి మెరిట్ జాబితాలను మార్చేందుకు అధికార పార్టీ పెద్దల వద్ద పని చేస్తున్న ఓ వ్యక్తి రంగ ప్రవేశం చేశారు. తామిచ్చిన జాబితాలలోని వ్యక్తులకే పోిస్టింగ్లు ఇవ్వాలంటూ ఉన్నతాధికార్లపై ఒత్తిళ్లు పెంచిన సదరు అధికారి ఏకంగా గురువారం కలెక్టరేటులో మకాం వేశారు. ఏకకాలంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులతోపాటు వైద్యాధికార్ల నియామకానికి సంబంధించి కసరత్తు జరుగుతున్న కీలక సమయంలో అధికార పార్టీ కీలక నేత కార్యాలయ ప్రతినిధి ఇలా మకాం వేయడం మెరిట్ అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో 47 వైద్యాధికార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 30 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 269మంది డాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. రోస్టర్ విధానంలో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సిఉంది. అయితే దరఖాస్తుదారుల్లో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న వారు కూడా ఉన్నారు. అక్కడ మెరిట్ మార్కులతో సర్టిఫికెట్లను పొందిన వైద్యులు ఈ పోస్టింగ్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకున్న వారితోపాటు విదేశాల్లో చదివిన వారికి వచ్చే మార్కులతో సమానంగా పరిగణలోకి తీసుకుంటే మార్కుల్లో వ్యత్యాసం తప్పదని రాష్ట్రంలో చదువుకున్న వారు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మెరిట్లను పక్కన పెట్టి తామిచ్చిన జాబితాలకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికార పక్షం నేతల అనుచరగణం ఒత్తిడి పెంచారు. దీంతో జాబితా విడుదలలో జాప్యం కొనసాగుతోంది. వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన సమస్యల వల్ల నియామకాలు ఇవ్వడానికి కొంత ఆలస్యమైంది. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నతాధికార్లనుంచి వచ్చిన ఆదేశానుసారం వికలాంగుల అభ్యర్థుల జాబితా ఖరారైంది. అభ్యర్థుల ఎంపిక కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి జాబితాలను సిద్ధం చేసింది. పోస్టింగ్‌లకు గురువారం అభ్యర్థులను సిద్ధం చేసిన తరుణంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నియామకాలు జరపాలంటూ మోకాలు అడ్డం పెట్టారు. ఇందులోనూ అన్యాయం జరగడానికి వీల్లేదంటూ ఉన్నతాధికార్లు తెగేసి చెప్పడంతో కొంత వెనక్కితగ్గారని తెలుస్తోంది. దీంతో అధికారులు 35మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ పోస్టింగ్‌లను సిద్దం చేశారు. ఏది ఏమైనా అధికార పార్టీ నేతల అనుచరుల మంటూ వారి కార్యాలయ అధికారులు పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడం ఉన్నతాధికార్లకు మింగుడు పడడం లేదు. -
పచ్చపాతం
అభివృద్ధి హామీ ఎన్నికల స్టంట్‌గానే మిగిలిపోతోంది. ఓటర్ల ముందుకొచ్చినప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామనే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలు, అధికారంలోకి రాగానే ఆ బాధ్యత విస్మరిస్తున్నారు. పార్టీలకే పరిమితం కావాల్సిన రాజకీయాలు.. అభివృద్ధికి అడ్డంకిగా మారడం ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. నిధులు మంజూరైనా.. అధికారులు సానుకూలంగా ఉన్నా.. ఆ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ బలంగా ఉందనే సాకుతో అధికార పార్టీ నేత రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా ఊపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అవుకు : అవుకు నుంచి గుండ్ల శింగవరం మీదుగా గడ్డమేకల పల్లె, రామవరం, మెట్టుపల్లె కోనాపురం గ్రామాలను కలుపుతూ దాదాపు 13 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి పీఎంజీఎస్‌వై రెండో విడత కింద ప్రభుత్వం రూ.7.47 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలు తమ కష్టాలు తీరుతాయని సంతోషపడ్డారు. అయితే రాజకీయ అడ్డంకులు ఏర్పడటంతో మంజూరైన నిధులు మురిగిపోతున్నాయి. ఆ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుందనే ఒకే ఒక్క సాకుతో రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యగా మారిందని నియోజకవర్గ ప్రజాప్రతినిధి మోకాలడ్డారు. రామవరం నుండి మెట్టుపల్లె వరకు ప్రభుత్వ భూమి 25.35 ఎకరాలు ఉండగా.. రైతుల నుంచి 1.81 ఎకరాలు, కోనాపురం మెట్ట నుండి జంక్షన్ వరకు 4.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. రైతుల నుండి 0.42 ఎకరాలు, గడ్డమేకల పల్లె నుండి రామవరం వరకు 2.93 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. 6.40 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. గుండ్ల శింగవం నుండి గడ్డమేకల పల్లె వరకు ప్రభుత్వ భూమి 5.56 ఎకరాలు ఉండగా రైతుల నుండి 3.09 ఎకరాలు అవసరమవుతుంది. రోడ్డు నిర్మాణానికి 37.89 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. రైతుల నుండి కేవలం 11.72 ఎకరల భూమిని సేకరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చి కలెక్టర్, ఆర్డీఓకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఆ ప్రజాప్రతినిధి ఆదేశాలతో అధికారులు మౌనం దాల్చారు. రాజకీయ కక్షతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రామవరం- మెట్టుపల్లెకు 5 కిలోమీటర్లు, కోనాపురం మెట్ట నుంచి 2 కిలోమీటర్లు, గడ్డమేకలపల్లె-రామవరానికి 2 కిలోమీటర్లు, గుండ్లశింగవరం- గడ్డమేకలపల్లెకు 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నిధులు నిలిచిపోవడంతో గుంతలమయమైన రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. రోడ్డు నిర్మాణంలో రాజకీయం తగదు రాజకీయ కక్షతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రజాప్రతినిధి అభివృద్ధిని విస్మరించడం తగదు. తాను ఆదే శించే వరకు నిధులను హోల్డ్‌లో పెట్టమని సంబంధిత అధికారులను ఆదేశించడం ఎంతవరకు సమంజసం.- కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె వైఎస్ఆర్సీపీ బలంగా ఉందనే మా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే కారణంతోనే రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతున్నారు. రోడ్డు పూర్తయితే ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్య పరిష్కారమవుతుంది. ప్రజల కష్టాలు చూసైనా రాజకీయాలకు అతీతంగా రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి. - రమాదేవి, సర్పంచ్, రామవరం అభివృద్ధికి రాజకీయాలతో ముడిపెట్టొద్దు రాజకీయ కక్షలతో అభివృద్ధిని అడ్డుకోవడం తగదు. ఈ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయనే కారణంగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం తగదు. - రమణ, మెట్టుపల్లె సర్పంచ్ భూములిచ్చేందుకు సిద్ధం గుండ్లశింగవరం నుండి గడ్డమేకల పల్లె, రామవరం, మెట్టుపల్లె గ్రామలకు రోడ్డు వేయడానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోడ్డు పూర్తయితే మాకెంతో మేలు చేకూరుతుంది. బనగానపల్లెకు వెళ్లేందుకు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. - స్వామినాథం, రామవరం రవాణా సౌకర్యం మెరుగవుతుంది బీటీ రోడ్డు పూర్తయితే నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. రైతులు పంట ఉత్పత్తులు తరలించుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది. - మద్దిలేటి, రామవరం ఎమ్మెల్యే ఆదేశాలు వచ్చాకే పనులు అవుకు నుంచి గుండ్ల శింగవరం మీదుగా నాలుగు గ్రామాలను కలుపుతూ 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.7.47 కోట్లు మంజూరయ్యాయి. భూ సేకరణ కొంత సమస్యగా ఉంది. అందువల్ల నిధులను హోల్డ్‌లో ఉంచాం. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. ఆ తర్వాత పనులు చేపడతాం. - మద్దిలేటి, పంచాయతీరాజ్ డీఈ -
హుద్‌హుద్ @ కాసుల వర్షం
హుద్‌హుద్ తుపాను ఎందర్నో నిరాశ్రయులను చేసింది. ఆకలితో అలమటించేలా చేసింది. కానీ అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించింది. పేదలకు చేరాల్సిన నిత్యావసరాలు పక్కదారి పట్టించి వీరు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు బాధితులకిచ్చే పరిహారంపై కన్నేశారు. దాన్ని కూడా కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరికి పలువురు ఎమ్మెల్యేల అండదండలు ఉన్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: తుపాను బాధితులకు తక్షణ సహాయం కోసం బియ్యంతో సహా ఎనిమిది రకాల నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్డులున్న వారికి ...లేని వారికి కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలుంటే కార్డులతో ప్రమేయం లేకుండా పంపిణీ చేశారు. గత నెల 29వ తేదీ వరకు నగర పరిధిలో పంపిణీ చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 5వ తేదీ వరకు పంపిణీ చేశారు. తేలిన లెక్కలను బట్టి చూస్తే ఏ మేరకు పక్కదారి పట్టాయో అర్థమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 11,08,521 రేషన్‌కార్డులుండగా, 11.74 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో విశాఖసిటీ పరిధిలో 3,76,939 కార్డులుంటే, రూరల్ జిల్లా పరిధిలో 7,36,517 కార్డులున్నాయి. జిల్లాలో 11.74 లక్షల కుటుంబాలుంటే తుపాను నేపథ్యంలో ఏకంగా 14.83 లక్షల కుటుంబాలకు బియ్యంతో సహా తొమ్మిది నిత్యావసరాల పంపిణీ జరిగింది. ఒక్క విశాఖ మహానగర పరిధిలోనే 4.54 లక్షల కుటుంబాలుంటే ఏకంగా 5.63,077 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇక రూర ల్ పరిధిలో 7.20 లక్షల కుటుంబాలుంటే 9.20 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు..జిల్లా కలెక్టర్‌తో సహా సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ప్రతి ఒక్క కుటుంబం తీసుకున్నట్టే లెక్క. కార్డుల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. కుటుంబాల సంఖ్య కంటే సాయం పంపిణీ చేసిన కుటుంబాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. కార్డులతో పోల్చుకుంటే 3.75 లక్షల కుటుంబాలకు అదనంగా ఇస్తే, కుటుంబాలతో పోలిస్తే 3లక్షల కుటుంబాలకు అదనంగా ఇచ్చినట్టే. వీటిలో కార్డుల్లేకుండా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో నగర పరిధిలో 71,720 కుటుం బాలు, రూరల్‌లో 30 వేల కుటుంబాలకు పంపిణీ చేసినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలన్నీ పొంతనలేకుండా ఉన్నాయి. రైతుబజార్ రేట్ల ప్రకారం చూసుకున్నా ఒక్కొక్క కుటుంబానికి పంపిణీ చేసిన సాయం విలువ రూ.800 వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో ఏకంగా రూ.8 కోట్ల విలువైన సరకును పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇక కుటుంబాల సంఖ్య కంటే అదనంగా పంపిణీ చేసిన సరకుల విలువ చూస్తే ఏకంగా పాతిక కోట్ల పైమాటే. ఒక్క బియ్యమే నగర పరిధిలో 14,469 మెట్రిక్ టన్నులు, గ్రామీణ ప్రాంతంలో 15వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టుగా చెబుతున్నారు. ఇంకా అందలేదంటూ క్షేత్రస్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులొస్తూనే ఉన్నాయి 11.74 లక్షల కుటుంబాలున్న జిల్లాలో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారని చెబుతుండడం చూస్తుంటే ఏ మేరకు పక్కదారి పట్టిందో అర్థమవుతోంది. వీటిలో ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదారువేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరకులన్నీ డీలర్ల సహకారంతో తెలుగు తమ్ముళ్లు దారిమళ్లించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ దాడులేవీ?: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల నిర్వహించిన వరుస తనిఖీల్లో వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వ చేసిన వారిని వదిలేసి..ఆ బియ్యం సరఫరా చేసిన డీలర్లపై కేసులు పెట్టారు. వీరి తనిఖీల్లో దేశం నేతలు, కార్యకర్తల ప్రమేయం ఉన్నట్టుగా బట్టబయలవుతుండడంతో ఆ మచ్చ ఎక్కడ తమ ప్రభుత్వానికి అంటుతుందోననే భయంతో ప్రభుత్వం ఈ దాడులకు పుల్‌స్టాప్ పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెలాఖరులో హడావుడి చేసిన విజిలెన్స్ అధికారులు నాలుగైదురోజులుగా చడీచప్పుడు లేకుండా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా ఉన్న వారు ఈ తుపాను సాయం పుణ్యమాని లక్షలు వెనకేసుకున్నారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సాయం స్వాహాలో కోట్లు గడించిన తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు పేదలకు దక్కాల్సిన పరిహారంపై కన్నేశారని విమర్శలున్నాయి. నచ్చిన వారికి ఒకలా..నచ్చని వారికి మరొకలా పరిహారం అందేలా చక్రంతిప్పుతున్న వీరు పరిహారంలో కూడాలో పర్సంటేజ్‌లు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.