నల్ల బంగారు సిరులు పండించే సింగరేణి విఫణి వీధుల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. బొగ్గు కంపెనీల పోటీతో మార్కెట్‌లో నిలదిక్కుకోలేక విలవిల్లాడుతోంది. దీనికి తోడు పెరిగిన ఉత్పత్తి వ్యయం, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, రవాణా రంగంలో డొల్లతనం మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. అంతర్గత సమస్యలు పరిష్కరించి పరిస్థితులను చక్కదిద్దాల్సి న యాజమాన్యం డైరెక్టర్ స్థాయి అధికారుల
-
ఇటు అంతర్గత సమస్యలు
-
అటు మార్కెట్‌లో పోటీ
-
ఆర్థిక సంక్షోభం దిశగా కంపెనీ
-
పట్టించుకోని యాజమాన్యం
-
ఆందోళనలో కార్మిక వర్గం
నల్ల బంగారు సిరులు పండించే సింగరేణి విఫణి వీధుల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. బొగ్గు కంపెనీల పోటీతో మార్కెట్‌లో నిలదిక్కుకోలేక విలవిల్లాడుతోంది. దీనికి తోడు పెరిగిన ఉత్పత్తి వ్యయం, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, రవాణా రంగంలో డొల్లతనం మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. అంతర్గత సమస్యలు పరిష్కరించి పరిస్థితులను చక్కదిద్దాల్సి న యాజమాన్యం డైరెక్టర్ స్థాయి అధికారులవైపు చూస్తోంది. వారు మాత్రం వాటిని వదిలేసి ‘మార్కె ట్’ బూచిని చూపిస్తూ కంపెనీ నష్టాల్లోకి పోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు సంస్థను ఎటు తీసుపోతాయోననే ఆందోళన కార్మికవర్గంలో నెలకొంది.
– రామకృష్ణాపూర్ (ఆదిలాబాద్)
సింగరేణి సంస్థ వివిధ కంపెనీల మాదిరి గానే సిమెంట్, విద్యుత్, సున్నం, ఐరన్, ఇటుక తయారీ తదితర సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తోంది. కోలిండియాలోని పలు కంపెనీలు సైతం వినియోగదారులకు బొగ్గు సరఫరా చేసేందుకు పోటీ పడుతుండగా ఇండోనేషియా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి బొగ్గు దిగుమతులు సాగుతున్నాయి. ఇతర దేశాలతో పాటు దేశీయంగా ఉన్న బీసీసీఎల్, జార్ఖండ్ గనులు, ఉత్తర భారతదేశంలోని మరికొన్ని సంస్థలు తక్కువ ధరకే బొగ్గు సరఫరా చేస్తుండడంతో ఈ ప్రభావం సింగరేణిపై పడుతోంది. సింగరేణి భూగర్భగనుల్లో ఉత్పత్తి అవుతున్న టన్ను బొగ్గుకు రూ.3,000 వ్యయం అవుతోంది. ఈ లోటును ఓసీల నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గుతో పూడ్చుతున్నారు. కంపెనీ మార్కెట్‌లో విక్రయిస్తున్న బొగ్గు ధరతో పోల్చితే ఇతర సంస్థ లు టన్నుకు రూ.200 తక్కువకు ఇస్తున్నాయి.
నష్టాలను అధిగమిస్తేనే మనుగడ
సంస్థాగతంగా దిద్దుబాటు చేపట్టి నష్టాలను అధిగమిస్తేనే సంస్థ మనగలుగుతుందని ఆర్థిక వేత్త లు సూచిస్తున్నారు. ముఖ్యంగా భూగర్భగనుల్లో ప్రణాళికాబద్ధంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక పని స్థలంలో బొగ్గు ఉత్పత్తి పూర్తి కాకముందే మరో పని స్థలాన్ని బొగ్గు ఉత్పత్తికి అనువుగా(సిద్ధంగా) ఉంచాలి. అలాగే ఎస్‌డీఎల్ యంత్రాల ద్వారా రోజుకు 150 నుంచి 170 టబ్బుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ పని స్థలాలు అనుకూలంగా లేని కారణంగా కొన్ని సందర్భాల్లో 20 నుంచి 30 టబ్బుల బొగ్గు మాత్రమే వస్తోంది. పని స్థలాలను సిద్ధం చేయడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని తెలుస్తోంది. పని స్థలాలను ఎప్పటికప్పుడు గుర్తించడం తో పాటు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని కార్మికుల్లో నైపుణాన్ని(స్కిల్స్) మరింత మెరుగు పరిస్తే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.
రవాణా ‘గండం’
ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులకు అందించే క్రమంలో రవాణాలోని లోపాలు మరింత ఇబ్బందులకు దారితీస్తున్నాయి. కంపెనీ రవాణా చేస్తున్న బొగ్గుకు, చివరి దశలో నమోదవుతున్న గణాంకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఫలితంగా ఏటా లక్షల టన్నుల బొగ్గు మాయమవడంతో సంస్థ భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది. ఇందుకు వివిధ స్థాయిల్లో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం.. భద్రతాపరమైన లోపాలు కారణంగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఉత్పత్తి అవుతున్న దానికి, అమ్మకాల సందర్భంలోని లెక్కలకు పొంతన లేకుండా పోతున్నాయి. ఏటా 1.20 లక్షల టన్నుల తేడా కనిపిస్తోంది. ప్రధానంగా వేయింగ్ మిషన్ల వద్ద ఈ లోపం ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే ఇటీవల కాలంలో పుట్టుకొచ్చిన బొగ్గు మాఫియా సమస్యకు మరో కారణం. భద్రతా పరంగా ఉన్న డొల్లతనా న్ని ఆసరా చేసుకుని రవాణా సమయంలో వ్యాగన్లు నిలిచినపుడు మాఫియా ముఠాలు బొగ్గును కొల్లగొడుతున్నట్లు సమాచారం. కొంతమంది భద్రతా సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి సంస్థకు చేటు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
గుదిబండగా బకాయిల భారం
కంపెనీకి వస్తున్న లాభాల నుంచి పన్నుల రూపేణ రాబట్టుకుంటున్న సర్కారు అదే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి
వచ్చే బకాయిలు రాబట్టే విషయంలో వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీపీ సింగరేణికి సుమారు రూ.3000 కోట్లు బకాయి పడి ఉంది. అలాగే ఆంధ్రా, మహారాష్ట్ర జెన్‌కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ కలిపి మరో రూ.2000 కోట్ల వర కు బకాయిలు రావలసి ఉన్నట్లు తెలిసింది. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకుని లాభాలు గడిస్తున్న సంస్థల నుంచి బొగ్గు బకాయిలు వసూలు కాకపోవడంలో సింగరేణి కంపెనీ నిర్లక్ష్యం కూడా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సింగరేణి చేపట్టిన జైపూర్‌లోని విద్యుత్ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కావడం వల్ల అంచనాలు పెరిగి వేల కోట్ల వడ్డీ కంపెనీ పై పడింది.
కార్మిక సంఘాలు కళ్లు తెరవాలి
కంపెనీకి వస్తున్న లాభాల నుంచి పన్నుల రూపేణ రాబట్టుకుంటున్న సర్కారు అదే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి
వచ్చే బకాయిలు రాబట్టే విషయంలో వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీపీ సింగరేణికి సుమారు రూ.3000 కోట్లు బకాయి పడి ఉంది. అలాగే ఆంధ్రా, మహారాష్ట్ర జెన్‌కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ కలిపి మరో రూ.2000 కోట్ల వర కు బకాయిలు రావలసి ఉన్నట్లు తెలిసింది. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకుని లాభాలు గడిస్తున్న సంస్థల నుంచి బొగ్గు బకాయిలు వసూలు కాకపోవడంలో సింగరేణి కంపెనీ నిర్లక్ష్యం కూడా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సింగరేణి చేపట్టిన జైపూర్‌లోని విద్యుత్ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కావడం వల్ల అంచనాలు పెరిగి వేల కోట్ల వడ్డీ కంపెనీ పై పడింది.