హరితహారం ‘సాక్షి’గా పర్యావరణాన్ని కాపాడుదాం | in the presence of skshi plantation | Sakshi
Sakshi News home page

హరితహారం ‘సాక్షి’గా పర్యావరణాన్ని కాపాడుదాం

Published Mon, Jul 18 2016 6:44 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

హరితహారం ‘సాక్షి’గా పర్యావరణాన్ని కాపాడుదాం - Sakshi

హరితహారం ‘సాక్షి’గా పర్యావరణాన్ని కాపాడుదాం

యాదగిరిగుట్ట : హరితహారంలో భాగంగా సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ హరితహారం సాక్షిగా పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బూడిద స్వామి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కసావు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు, యాదగిరిగుట్ట సాక్షి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ఆరుట వేణుగోపాల చార్యులు, నల్ల ఇంద్రసేనారెడ్డి, కల్లెం సంపత్‌కుమార్, ఏపీఓ శ్రీనివాస్, ఆలేరు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బి.పుల్లయ్య, ఎంపీటీసీ కైరంకొండ వినోద్, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మెుక్కల పరిరక్షణకు టీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు రూ.3వేల విలువైన ట్రి గార్డ్స్‌ను సాక్షికి అందజేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement