ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలో అపశ్రుతి
తలుపుల : మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఎమ్యెల్యే అత్తార్ చాంద్ బాషా ఆధ్వర్యంలో టీడీపీ జనచైతన్యయాత్ర చేపట్టారు. స్థానిక టీడీపీ నాయకులు పటాసులు పేల్చారు. అయితే వీటిలోని నిప్పు గ్రామానికి చెందిన మంగళ కృష్ణ ఇంటి మిద్దెపై పడటంతో అక్కడ ఉన్న పది మూటల వేరుశనగ కాయలు, వాటిపై కప్పిన టార్పాలిన్, అక్కడ ఆరవేసిన సుమారు 20 జతల దుస్తులు కాలిపోయాయి. దీంతో సుమారు 24వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.