కళాశాలను పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు
కళాశాలను పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు
Published Sat, Sep 10 2016 10:00 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
నాగార్జునసాగర్ : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాలను శనివారం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పరిశీలించారు. పాఠశాలను అప్‌గ్రేడ్ చేసి నూతనంగా ఈ ఏడాదే కళాశాలను ఏర్పాటు చేయడంతో సరిపడ అధ్యాపకులు లేక అర్హులైన స్థానిక పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులతోనే తరగతులు నిర్వహిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ నన్నూరిభాస్కర్‌రెడ్డి అధికారులకు తెలిపారు. త్వరలో కాంట్రాక్టు లెక్చరర్లు నియామకం అవుతున్నట్లు వారికి వివరించారు. పరిశీలనకు వచ్చిన అధికారులు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కుందూరునారాయణరెడ్డి, అకాడమిక్ అధికారి మోహన్‌రెడ్డి త్వరలో ఇంటర్మీడియట్ పుస్తకాలను అందజేస్తామని విద్యార్థులకు తెలిపారు. కళాశాల యాజమాన్యానికి తగు సలహాలు సూచనలు చేశారు. అన్ని విధాలుగా తమ సహకారం కళాశాలకు అందజేస్తామని తెలిపారు.
Advertisement