ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 26, 27వ తేదీల్లో సంగారెడ్డిని కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పోతులబోగుడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లిక తెలిపారు.
అల్లాదుర్గం: మోడల్ స్కూల్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 26, 27వ తేదీల్లో సంగారెడ్డిని కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పోతులబోగుడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లిక మంగళవారం తెలిపారు. 26న ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆఫరేటర్, ఆఫీస్ సబార్డినేటర్ కం స్వీపర్ పోస్టులు, 27న వాచ్‌మెన్ కం స్వీపర్ పోస్టును భర్తీ చేయడానికి ఏజేసీ చాంబర్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు.