
20 నుంచి ఐపీఎస్‌జీఎం క్రీడాపోటీలు
గుడ్లవల్లేరు : రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ 21వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్(ఐపీఎస్‌జీఎం)ను గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేమ్స్ విభాగంలో చెస్, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నీస్, బాల్ బాడ్మింటన్, బాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో పోటీలు ఉంటాయన్నారు. స్పోర్ట్స్ విభాగంలో బాలురకు 11, బాలికలకు 8 అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలకు మొత్తం 1,200 మంది క్రీడాకారులు, 120మంది పీడీలు వస్తారన్నారు. ఈ సమావేశంలో పలు విభాగాల అధిపతులు ఎన్‌వీకే ప్రసాద్, వినయ్, కృష్ణప్రసాద్, శరత్ తదితరులు పాల్గొన్నారు.