పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైన జఫర్‌గఢ్ కోట
చారిత్రక నేపథ్యమున్న జఫర్‌గఢ్ కోటపై తొలిసారి జాతీయ పతాకం రెపరెపలాడనుంది. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న కోట కట్టడాల్లో ఒకటైన ఖమ్మం దర్వాజపై జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
జఫర్‌గఢ్ : చారిత్రక నేపథ్యమున్న జఫర్‌గఢ్ కోటపై తొలిసారి జాతీయ పతాకం రెపరెపలాడనుంది. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న కోట కట్టడాల్లో ఒకటైన ఖమ్మం దర్వాజపై జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య ఇటీవల హరితహారంలో భాగంగా జఫర్‌గఢ్‌కు వచ్చిన సందర్భంలో కోటను పరిశీలించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గోల్కొండ కోట మాదిరిగా ఈ కోటపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించిన ఆయన తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ మేరకు దర్వాజపై జాతీయ జెండా ఆవిష్కరించేందుకు గద్దె నిర్మించడమే కాకుండా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాజయ్య ఇక్కడ జాతీయ జెండా ఎగురవేయనున్నారు.