పోలీసుల తీరుపై జేసీ అసంతృప్తి
అనంతపురం : అనంతపురం జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. తన ముఖ్య అనుచరులకు భద్రతగా పెయిడ్ గన్మెన్లను ఇవ్వడంపై జేసీ ప్రభాకర్రెడ్డి మండిపడుతున్నారు. అందుకు నిరసనగా ప్రభుత్వం తనకు కేటాయించిన ఇద్దరు గన్మెన్లను ఆయన వెనక్కి పంపించేశారు.
తన ముఖ్య అనుచరులకు ప్రాణ భయం ఉందని... వారికి భద్రతగా గన్మెన్లను కేటాయించాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి... జిల్లా ఎస్పీని కోరారు. అందులోభాగంగా వారికి ప్రభుత్వం పెయిడ్ గన్మెన్లను కేటాయించింది. దీనిపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.