ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టింది
అనంతపురం : అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టిందని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం అనంతపురంలో మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటానని ప్రభాకర్ చౌదరి హాడావుడి చేస్తున్నాడు... కనీసం 2 వేల మొక్కలు కూడా నాటలేదిని ఆరోపించారు. ఓ వేళ లక్ష మొక్కలు నాటినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ విసిరారు.
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. గాంధీ విగ్రహం సిద్ధమైంది కానీ... విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ నుంచి ఎలాంటి అనుమతులు లేదన్నారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతో ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు లేవని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు.
అనంతపురం నగరంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో వారిద్దరి మధ్య మాటలయుద్దం మొదలైంది. ఆ క్రమంలో శుక్రవారం గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ అందుకు నెలరోజులు గడువు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చౌదరికి... జేసీ సవాల్ విసిరారు. లేకుంటే తామే ఆ పని చేస్తామని చెప్పారు. ఆ క్రమంలో ప్రభాకర్ చౌదరిపై విధంగా స్పందించారు.