బనగానపల్లె ఆసుపత్రికి కాజల్, రానా
బనగానపల్లె ఆసుపత్రికి కాజల్, రానా
Published Tue, Jun 13 2017 9:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
బనగానపల్లె రూరల్: సినీ హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం బనగానపల్లె ఆసుపత్రికి చేరుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌ను అక్కడ నిర్వహించారు. మూడు రోజులుగా యాగంటి క్షేత్రంలో నిర్వహిస్తున్న షూటింగ్‌ను మంగళవారం రానా, కాజల్ మధ్య ఆసుపత్రిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గర్భిణిగా కాజల్ ఆసుపత్రికి రాగా, స్కానింగ్ చేసే సన్నివేశాలను షూటింగ్ చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ గదికి వెళ్లే ప్రధాన గేట్‌కు తాళం వేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఎస్‌ఐ రాకేష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. బుధవారం యాగంటిలో షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement