
నేనేరాజు.. నేనే మంత్రి షూటింగ్
యాగంటిక్షేత్రం(బనగానపల్లె రూరల్) : యాగంటిక్షేత్రం శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం నేనేరాజు..నేనే మంత్రి సీనిమాకు సంబంధించి కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. హీరో రాణా, హీరోయిన కాజల్‌తోపాటు శివాజీరాజా, మరికొందరి నటీనటులతో ఆలయంలో పూజకు సంబంధించిన సన్నీవేశాన్ని చిత్రీకరించారు. ప్రముఖ దర్శకులు తేజా, నిర్మాత సురేష్ ఆధ్వర్యంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సీనిమాను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. సోమవారం కూడా షూటీంగ్ కొనసాగుతుందని తెలిపారు.