మోపిదేవిలో జయేంద్ర సరస్వతి | kanchi swameejees visit mopidevi | Sakshi
Sakshi News home page

మోపిదేవిలో జయేంద్ర సరస్వతి

Published Mon, Sep 26 2016 9:22 PM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM

మోపిదేవిలో జయేంద్ర సరస్వతి - Sakshi

మోపిదేవిలో జయేంద్ర సరస్వతి

 
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని శ్రీ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సోమవారం దర్శించుకున్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు, ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి స్వాగతించగా ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అనుగ్రహ భాషణచేసి, ఆశీర్వాదం అందచేశారు. అనంతరం దేవస్థానం తరపున ఆలయ ఏసీ స్వామివారి చిత్రపటం బహూకరించారు. 

టేకుపల్లిలో జయేంద్రసరస్వతి 
మండలంలోని టేకుపల్లిలో ఉన్న శ్రీ కంచికామకోటి పీఠపాలిత బాల పార్వతీ సమేత రామేశ్వరస్వామివారిని కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్రసరస్వతి సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయన వెంట శిష్యుబృందం, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ, ఆలయ అర్చకులు ఫణికుమార్‌శర్మ, వెంకటేశ్వరరావు, బాలకృష్ణశర్మ, టేకుపల్లి దేవస్థానం మేనేజింగ్‌ ట్రస్టీ యడవల్లి నీలిలోహిత శర్మ, వెంపటి కుటుంబశాస్త్రి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

స్వామిని దర్శించుకున్న భువనచంద్ర
స్వామివారిని సినీగేయ రచయిత భువన చంద్ర సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ  ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఏసీ ఎం శారదాకుమారి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందచేశారు. ఆయన వెంట విద్యాసంస్థల అధినేత కె.ఈశ్వరరావు, గుడిశేవ విష్ణుప్రసాద్‌ ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement