- కాపు ఉద్యమ నేత ముద్రగడ
- ఉత్సాహంగా కాపు కార్తిక వనసమారాధన
ఓట్లు కోసం చంద్రబాబు పాదయాత్ర చేయలేదా ?
Published Sun, Nov 27 2016 11:27 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో ఓట్లకోసం పాదయాత్ర చేశారని అప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడపద్మనాభం డిమాండ్ చేశారు. కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సిఎల్ రోడ్డులోని కాపు కల్యాణమండపంలో ఆదివారం కాపు కార్తిక వనసమారాధనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఆ సంగతే పట్టించుకోవడం లేదన్నారు. రిజర్వేషన్లు అడుగుతుంటే పాకిస్థానీలు , తాలిబన్లలా చూస్తున్నారన్నారు. సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహిస్తుంటే పదివేల మంది పోలీసులను ఎందుకు దింపాల్సి వచ్చిందన్నారు. ఉద్యమ నాయకుల గృహనిర్బంధం దారుణమన్నారు. కాపులను ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారన్నారు. గతంలో కాపులకు ఉన్న రిజర్వేషన్లు మాత్రమే తాము అడుగుతున్నామన్నారు. కాపు ఉద్యమం శాంతియుతంగానే నిర్వహిస్తామన్నారు. కార్తిక మాసంలో వన సమారాధనలు చేయడం శుభసూచకమన్నారు. ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభమైన కాపు కార్తిక సమారాధన, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది. ఈ సందర్భంగా ముద్రగడ కాపు సద్భావ సంఘం వ్యవస్థాపకులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, జ్యోతుల నెహ్రూ , వరుపుల సుబ్బారావు, తోట త్రిమూర్తులు, ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వంగా గీత, పంతం గాంధీమోహ¯ŒS తదతరులు పాల్గొన్నారు.
కాపు నాయకులతో కిటకిటలాడిన ముద్రగడ స్వగృహం
కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ సినీ హీరో మంచు మోహ¯ŒSబాబు ఆదివారం రావడంతో జిల్లా నుంచే కాక విశాఖ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కాపు నాయకులు, జేఏసీ నాయకులు, ఆయన అభిమానులు ఉదయాన్నే ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. మోహ¯ŒSబాబును చూసేందుకు అభిమానులు ఎక్కువగా చేరుకున్నారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న మోహ¯ŒSబాబు దంపతులకు ముద్రగడ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముద్రగడ జేఏసీ నాయకులను, అభిమానులను మోహన్‌బాబుకు పరిచయం చేశారు. ముద్రగడను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, అద్దేపల్లి శ్రీధర్, విశాఖ జిల్లా నాయకులు తోట రాజు, మాజీ ఎంపీ గురజాల వెంకటస్వామి నాయుడు , జేఏసీ నాయకులు జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్,గోపు చంటిబాబు, గౌతు స్వామి, గొల్లపల్లి కాశీ విశ్వనాథం, గోపు చంటిబాబు, మలకల చంటిబాబు, నరిసే శివాజీ, నరిసే సోమేశ్వరరావు, తోట బాబు, విశాఖ రూరల్ వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత, గౌతు సుబ్రహ్మణ్యం, రాజానగరం నియోజకవర్గం నుంచి భారీగా కాపు యువకులు ముద్రగడను కలిశారు.
Advertisement