ఏపీలో అరెస్టు చేసిన తెలంగాణ కాపు నేతలను వెంటనే విడుదల చేయాలని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
మామిళ్లగూడెం : ఏపీలో అరెస్టు చేసిన తెలంగాణ కాపు నేతలను వెంటనే విడుదల చేయాలని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఇక్కడి నాయకులను అరెస్టు చేయడం సరైందికాదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.విజయ్‌కుమార్, నాయకులు గాంధీ, శెట్టి రంగారావు పాల్గొన్నారు.