‘కాసం పుల్లయ్య’ వార్షికోత్సవం
వరంగల్ చౌరస్తా : గత శతాబ్ద కాలంగా నాణ్యమైన దస్తులను అందిస్తూ జిల్లా ప్రజల ఆదరణ చూరగొంటున్నామని కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. వరంగల్‌లోని కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ మొదటి వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందచేయడమే తమ వ్యాపార లక్ష్యమని తెలిపారు. దసరా, దీపావళి కనుకగా నాలుగు కార్లను వినియోగదారులకు అందచేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం రూ.500 కొనుగొలుపై గిఫ్ట్ కూపన్ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాసం మల్లికార్జున్, కాసం కేదారి, కాసం శివ, రాహుల్, సిబ్బంది పాల్గన్నారు.