‘కస్తూర్బా’ విద్యార్థినులకు జ్వరాలు
డోర్నకల్ : మండల కేం ద్రంలోని కస్తూర్బా పా ఠశాలలో పది మంది వి ద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. 9వ తరగతి విద్యార్థిను లు జి.స్రవంతి, వినిత, రమ్యకృష్ణ, వనిత, శ్రీదే వి, అరుణ, మయూరి, అఖిల, 10వ తరగతి చదువుతున్న బి.స్వరూ ప, 8వ తరగతి విద్యార్థిని అమల జ్వరాలతో బాదపడుతున్నారు. పాఠశాల ఏఎన్‌ఎం ఎలిజిబెత్ విద్యార్థినులను స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా డాక్టర్ ఉపేందర్ వారిని పరీక్షించి సెలైన్ ఎక్కించారు. పాఠశాలలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరగడం, 9వ తరగతి బాలికలు పడుకునే గది పక్కనే సెప్టిక్ ట్యాంక్ ఉండటంతో దోమల బెడద పెరిగి బాలి కలు జ్వరాల బారిన పడినట్లు పాఠశాల సిబ్బం ది చెబుతున్నారు. పాఠశాలలో వృథా నీరు ప్రహరీ గోడ పక్కన ఉన్న పెద్ద గుంతలోకి చేరి నిల్వ ఉండటంతో ఈ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. పాఠశాల సిబ్బంది కూడా ఒకరిద్దరు జ్వరాల బారిన పడినట్లు తెలిసింది. జ్వరం వచ్చిన బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇళ్లకు పంపుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల పరిసరాలను శుభ్రపరచాలని, వృథా నీటిని పాఠశాలకు దూరంగా పంపేలా చర్యలు చేపట్టాలని, దోమల మందు పిచికారి చేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.