సాక్షి, దోమకొండ(నిజామాబాద్): ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఇద్దరు విద్యార్థినులు పాఠశాల నుంచి పారిపోయిన ఘటన దోమకొండ మండలం సీతారాంపల్లి శివారులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు.. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆదివారం వేకువజామున చున్నీల సహాయంతో పాఠశాల గోడ దూకి పారిపోయారు. విషయం ఆలస్యంగా గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే బీబీపేట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన విషయాన్ని కామారెడ్డి డీఎస్పీకి తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి విద్యారి్థనుల కదలికలను గమనించారు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.
చివరకు విద్యార్థినులు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు. విద్యార్థుల్లో ఒకరిది రాజంపేట మండలం, మరొకరిది మాచారెడ్డి మండలం. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకొని పాఠశాల నుంచి తప్పించుకున్నట్లు పోలీసులకు చెప్పారు. వీరిలో ఒక విద్యార్థి టగ్ ఆఫ్ వార్ క్రీడలో జాతీయ క్రీడాకారిణి. ఆమె గతంలో జాతీయ స్థాయి క్రీడలకు ఢిల్లీ వెళ్లింది. అప్పుడు ప్రధానిని కలువలేకపోయానని, ఇ ప్పుడు కలిసి ఫొటో దిగుతామని తోటి విద్యార్థినులకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. విద్యార్థినులు తప్పిపొయిçన సంఘటన సంచలనంగా మారింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థినులు తప్పిపోయారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు కోరుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి పోలీసులను ఎస్పీ శ్వేత అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment