
చంద్రబాబుతో కేసీఆర్ భేటీ
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేసీఆర్ తలపెట్టిన మహా చండీయాగానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న కేసీఆర్కు ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, రావెల కిశోర్ బాబు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు.
కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ విజయవాడ వెళ్లారు. కేసీఆర్ కోసం చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో 15 రకాల ఆంధ్ర వంటకాలను వడ్డించనున్నారు.