నేటి నుంచి కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు
బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుని ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నారు. అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే మండలవాసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3న శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తి విగ్రహాలను సాయంత్రం కొండపైకి తీసుకెళతారు. 4న దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యహవచనము, అంకురార్పణ నిర్వహిస్తారు. 5న సింహవాహనం, 6న శేష వాహనం,7న హనుమద్వాహనం,8న గరుడ వాహనం, 9న గజ వాహనంపై ఊరేగిస్తారు.10న కళ్యాణ మహోత్సవం అనంతరం సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు. 11న అశ్వవాహనంపై , 12న హంస వాహనంపై ఊరేగిస్తారు.