-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వెల్లడి
తూప్రాన్:మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణం పనులకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తూప్రాన్‌లో ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనుల విషయం పెండింగ్‌లో ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైలు మార్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం ఆదేశం మేరకు కేంద్ర రైల్వేమంత్రితో ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి చర్చంచి రైలు మార్గం నిర్మాణానికి మార్గం సుగమం చేశామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన రైలు మార్గం మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం ద్వారా 160 కిలోమీటర్ల మేర జిల్లా వ్యాప్తంగా విస్తరించనుందన్నారు. ఇందుకోసం రూ.1,160 కోట్ల నిధులతో కేంద్రం టెండర్లు వేసినట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి రైల్వేలైన్‌కు మోక్షం
Published Wed, Aug 3 2016 10:09 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement