The foundation stone
-
కొత్తపల్లి రైల్వేలైన్‌కు మోక్షం
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వెల్లడి తూప్రాన్:మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణం పనులకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తూప్రాన్‌లో ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనుల విషయం పెండింగ్‌లో ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైలు మార్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం ఆదేశం మేరకు కేంద్ర రైల్వేమంత్రితో ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి చర్చంచి రైలు మార్గం నిర్మాణానికి మార్గం సుగమం చేశామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన రైలు మార్గం మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం ద్వారా 160 కిలోమీటర్ల మేర జిల్లా వ్యాప్తంగా విస్తరించనుందన్నారు. ఇందుకోసం రూ.1,160 కోట్ల నిధులతో కేంద్రం టెండర్లు వేసినట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
శంకుస్థాపనలతోనే సరా?
అధికారులను నిలదీసిన గ్రామస్థులు చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): సి.సి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. నేటికీ పనులు చేపట్టలేదు. 12 ఏళ్ళుగా మంచినీరు రావటం లేదు. పట్టించుకోవటం లేదు...సబ్సిడీపై మినుములు పంపిణీ చేశారు. పల్లాకు తెగులు వచ్చి పంట పాడైపోయింది. పంట నష్టపరిహారం ఎవరిస్తారంటూ చాగంటివారిపాలెంగ్రామస్తులు, రైతులు అధికారులను నిలదీశారు. ముప్పాళ్ళ, చాగంటివారిపాలెం గ్రామాలలో గురువారం జన్మభూమి-మాఊరు గ్రామసభలు జరిగాయి. ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు.బ వ్యవసాయశాఖ మినుము విత్తనాలు ముందే పరీక్షలు చేసి, తెగుళ్ళను తట్టుకొనే రకాన్ని పంపిణీ చేస్తే నష్టపోకుండా ఉండేవాళ్ళమని రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎడిఎ రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ సిబ్బంది పొలాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పటంతో సద్దుమణిగారు. చాగంటివారిపాలెంలో 12 ఏళ్ళక్రితం పైపులైన్లు ఏర్పాటు చేశారని, అప్పటినుంచి ఇప్పటి వరకు నీరు లేక అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు. యధావిదిగానే అధికారులు తమశాఖల వివరాలను ప్రసంగించి గ్రామసభలను ముగించారు. లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్, రేషన్‌కార్డులు అందించారు. కార్యక్రమంలో ఎంపిపి సి.హెచ్.ఉమాదేవి, తహశీల్దార్ ఎ.భాస్కరరావు, ఎంపీడీవో టి.ఉషారాణి, సర్పంచ్ లు చెల్లి ముసలయ్య, మధిర సీతమ్మ, మండల ప్రాధమిక వైధ్యాధికారిణి కె.శ్రీజ్యోతి, ఎపివో చినకోటేశ్వరరావు, ఎ.ఓ ఆర్.సుజాత, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు మూడు గ్రామాల్లో జన్మభూమి రాజుపాలెం: మండలంలో చౌటపాపాయపాలెం ఆర్ఆండ్ఆర్ సెంటర్లో, కోటనెమలిపురి, దేవరంపాడు, నెమలిపురి గ్రామాల్లో శుక్రవారం జన్మభూమి- మాఊరు కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో జిల్లా పాండు గురువారం తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయిలో శంకుస్థాపన ఏర్పాట్లు
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి తాడికొండ: అమరావతి నూతన రాజధాని నిర్మాణానికి ఈనెల 22న జరగునున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలకశాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండ్రాయినిపాలెంలో శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ కాంతిలాల్ దండేను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాంగణంలో వీఐపీలకు ఒకటి, ఎంఐపీలకు ఒకటి, ప్రధాన వేదిక ఒకటి.. మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో రైతులకు వీఐపీ హోదా కల్పించనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావటానికి సుముఖత చూపిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఇది సీఎం చ్రందబాబు కృషి ఫలితమేనని చెప్పారు. దీన్ని బట్టి రానున్న రోజుల్లో రాజధాని నిర్మాణానికి మంచి రోజులు రానున్నట్లు పేర్కొన్నారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన వేదిక ఉద్దండ్రాయినిపాలెం ఎస్సీ కాలనీకి సమీపంలో ఈశాన్య ముఖ దిశగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జేసీ చెరుకూరి శ్రీధర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.