అధికారులను నిలదీసిన గ్రామస్థులు
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): సి.సి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. నేటికీ పనులు చేపట్టలేదు. 12 ఏళ్ళుగా మంచినీరు రావటం లేదు. పట్టించుకోవటం లేదు...సబ్సిడీపై మినుములు పంపిణీ చేశారు. పల్లాకు తెగులు వచ్చి పంట పాడైపోయింది. పంట నష్టపరిహారం ఎవరిస్తారంటూ చాగంటివారిపాలెంగ్రామస్తులు, రైతులు అధికారులను నిలదీశారు. ముప్పాళ్ళ, చాగంటివారిపాలెం గ్రామాలలో గురువారం జన్మభూమి-మాఊరు గ్రామసభలు జరిగాయి. ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు.బ వ్యవసాయశాఖ మినుము విత్తనాలు ముందే పరీక్షలు చేసి, తెగుళ్ళను తట్టుకొనే రకాన్ని పంపిణీ చేస్తే నష్టపోకుండా ఉండేవాళ్ళమని రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎడిఎ రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ సిబ్బంది పొలాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పటంతో సద్దుమణిగారు. చాగంటివారిపాలెంలో 12 ఏళ్ళక్రితం పైపులైన్లు ఏర్పాటు చేశారని, అప్పటినుంచి ఇప్పటి వరకు నీరు లేక అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు.
యధావిదిగానే అధికారులు తమశాఖల వివరాలను ప్రసంగించి గ్రామసభలను ముగించారు. లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్, రేషన్‌కార్డులు అందించారు. కార్యక్రమంలో ఎంపిపి సి.హెచ్.ఉమాదేవి, తహశీల్దార్ ఎ.భాస్కరరావు, ఎంపీడీవో టి.ఉషారాణి, సర్పంచ్ లు చెల్లి ముసలయ్య, మధిర సీతమ్మ, మండల ప్రాధమిక వైధ్యాధికారిణి కె.శ్రీజ్యోతి, ఎపివో చినకోటేశ్వరరావు, ఎ.ఓ ఆర్.సుజాత, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు మూడు గ్రామాల్లో జన్మభూమి
రాజుపాలెం: మండలంలో చౌటపాపాయపాలెం ఆర్‌ఆండ్‌ఆర్ సెంటర్‌లో, కోటనెమలిపురి, దేవరంపాడు, నెమలిపురి గ్రామాల్లో శుక్రవారం జన్మభూమి- మాఊరు కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో జిల్లా పాండు గురువారం తెలిపారు.
శంకుస్థాపనలతోనే సరా?
Published Thu, Jan 7 2016 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement