బలవంతపు భూసేకరణ తగదు
-
2013 చట్టాన్ని అమలు చేయాలి
-
ప్రజా సంఘాల నాయకులు
ధర్మసాగర్ : ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయ డం తగదని మహిళా రైతుల వేదిక రాష్ట్ర నాయకురాలు ఆశలత, సీసీసీ రాష్ట్ర నాయకురాలు, కాలమిస్ట్ కె. సజయ, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు విస్సా కిరణ్ అన్నారు. మండలంలోని ముప్పారం, దేవునూరులోని టైక్స్‌టైల్ పార్కు ప్రతిపాదిత స్థలం, జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్‌లో నిర్మించనున్న రిజర్వాయర్ భూములను బుధవారం రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కు ల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, సీసీసీ, మానవహక్కుల వేదిక రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్ట ప్రకారం మార్కెట్ రేటును సవరించి, పెంచకుండా అతి తక్కువ ధరకు భూములను సేకరించడం అన్యాయమన్నారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా దళిత, నిరుపేద రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూనిర్వాసిత రైతులకు లభించే నాణ్యమైన న ష్టపరిహారం, ఇతర విస్తృతమైన ఫలాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మిం చిన భారం కావడంతోనే దొడ్డిదారిన 123 జీఓ తీసుకొ చ్చి రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. భూసేకరణకు సహకరించని రైతులను బెదిరిస్తూ వారి నుంచి భూము లు బలవం తంగా లాక్కోవడం రాజ్యంగ విరుద్ధమైన చర్య అన్నారు. 123 జీఓపై హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయ వేసినప్పటికి ప్రభుత్వం దుందుడుకు తనా న్ని ప్రదర్శిస్తూ రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తుందన్నారు. ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పి.శంకర్, బీరం రాములు, చుంచు రాజేందర్, అద్దునూరి యాదగిరి, పొన్నాల రమేష్, నవీన్, కొండల్ పాల్గొన్నారు.
భూములను పరిశీలించిన అధికారులు
ధర్మసాగర్ : మండలంలోని ముప్పారం గ్రామంలో టెక్స్‌టైల్ పార్కు ప్రతిపాదిత భూములతోపాటు ఎలుకుర్తిలోని ప్రభుత్వ భూములను రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం పరిశీలించారు. జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించేందుకు రెండు రోజులుగా చేపట్టిన కార్యక్రమంలో భా గంగానే అధికారులు భూములను పరిశీలించినట్లు తెలిసింది. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఆర్డీఓ వెంకటమాధవరావు, డీఎఫ్‌ఓ భీమానాయక్, తహసీల్దార్ బి.సత్యనారాయణ, ఆర్‌ఐ అబ్బాస్, సర్వేయర్ భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.