
'నాయకుల స్వార్థమే బలి తీసుకుంది'
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న మునికోటి మృతదేహం తిరుపతికి చేరుకుంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, సి.రామచంద్రయ్య పలువురు నేతలు చెన్నై నుంచి అతని మృతదేహాన్ని తీసుకొచ్చారు. మునికోటి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు, ప్రజాసంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
రాజకీయ నాయకుల స్వార్థమే మునికోటిని బలి తీసుకుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏ రకమైన లబ్ధి చేకూరుతుందో తెలిసినా పదవుల కోసం నేతలు ప్రత్యేకహోదా అంశాన్ని పట్టించుకోవడం మానేశారని పేర్కొన్నారు. అనంతరం హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మునికోటి అంత్యక్రియలు జరిగాయి.