విద్యార్థినిని వేధించిన లెక్చరర్ అరెస్ట్ | Lecturer arrested for harassing student | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని వేధించిన లెక్చరర్ అరెస్ట్

Published Wed, Aug 10 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

Lecturer arrested for harassing student

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో తన తరగతిలోని విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. దీంతో ఆ ఉపాధ్యాయుడి చెర నుంచి తప్పించుకునేందుకు విద్యార్థిని(17) ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్‌ను అరెస్ట్ చేశారు.


మెదక్ జిల్లా సిద్దిపేటలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న రామచంద్రం అదే కళాశాలలో చదువుకుంటున్న రెండో సంవత్సరం విద్యార్థినిని గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని పదే పదే ఇబ్బందులకు గురి చేస్తుండటంతో.. విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లెక్చరర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement