లేపాక్షి : అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడానికి నిపుణులతో సలహాలు తీసుకుంటున్నట్లు అనంతపురం టూరిజం శాఖ డీఈఈ సాయిసుధీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈశ్వరయ్య, ఆర్కెటిక్స్ బీకే తాటియా, ఆర్టిస్ట్ రమాదేవి తెలిపారు. శుక్రవారం సాయంత్రం లేపాక్షిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ, కలెక్టర్ ఆదేశాల మేరకు లేపాక్షికి వచ్చామన్నారు.
అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఎలాంటి సందర్శన స్థలాలను అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. లేపాక్షి నంది విగ్రహానికి దక్షిణ భాగంలో పెద్దగుండ్లపై ఆకర్షణీయమైన జఠాయువు పక్షి విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్టు వివరించారు. అదేవిధంగా లేపాక్షికి తూర్పు, పడమటి ద్వారాలను ఆధునికీకరించుటకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు
Published Fri, Mar 3 2017 10:11 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement
Advertisement