
నాణ్యతకు పాతర
– ఊడుతున్న పైకప్పు పెచ్చులు
– ఆర్టీసీ బస్టాండులో త్రుటిలో తప్పిన ప్రమాదం
హిందూపురం రూరల్ : కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రయాణికుల పాలిట యమశాపం. నాసిరకం పనులకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది హిందూపురం ఆర్టీసీ బస్టాండ్. ఆరు నెలల క్రితం రూ.50 లక్షలతో సుందరీకరణ పేరుతో ఆర్టీసీ బస్టాండుకు కొత్త హంగులు దిద్దారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయించడంతో ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. తాజాగా బుధవారం మధ్యాహ్నం చౌళూరుకు చెందిన చౌడప్ప పక్కనే పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో భయపడిపోయాడు. ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై ఊడిపోయే దశలో ఉన్న పైకప్పు పెచ్చులను తొలగించారు.