తీవ్రంగా గాయపడిన సుగుణమ్మ
– 9 మందికి తీవ్ర గాయాలు
– ఒకరి పరిస్థితి విషమం
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో సోమవారం లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి కథనం మేరకు... మదనపల్లెలోని చిత్తూరు బస్టాండు నుంచి పలమనేరుకు ప్రయాణికులతో ప్రైవేట్ బస్సు బయలుదేరింది. బసినికొండ పంచాయతీ బైపాస్ రోడ్డులోని వై.సర్కిల్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొంది. బస్సులోని ప్రయాణిస్తున్న పుంగనూరుకు చెందిన షఫూరాబీ(44), జి.రాహబరుల్లా(42), తంబళ్లపల్లెకు చెందిన మల్లిక(21), రామరాజు(25), సీటీఎం రెడ్డివారిపల్లెకు చెందిన సి.వెంకటరణ(65), వెంకటలక్ష్మి(24), పట్టణంలోని అమ్మినేని వీధికి చెందిన సుగుణమ్మ(50), అల్లాబక్షు(45), చెందిన శ్వేత(21) తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో సుగుణమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తీసుకెళ్లారు. లారీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు.