ప్రేయసికి పెళ్లి చేశారని.. | lover were married .. | Sakshi
Sakshi News home page

ప్రేయసికి పెళ్లి చేశారని..

Aug 25 2016 11:15 PM | Updated on Sep 4 2017 10:52 AM

ప్రేయసికి పెళ్లి చేశారని..

ప్రేయసికి పెళ్లి చేశారని..

తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారనే మనస్థాపంతో జమ్మలమడుగు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఆదినారాయణ(18) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జమ్మలమడుగు:
 తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారనే మనస్థాపంతో జమ్మలమడుగు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఆదినారాయణ(18) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన  జి.ఆదినారాయణ, దువ్వూరు మండలం మన్నెరాంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకొని వచ్చారు.

దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు దువ్వూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి చేసుకున్న యువతీ యువకులిద్దరు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే వీరిద్దరూ మైనర్‌లు అని ఈ వివాహం చెల్లదని పోలీసులు తేల్చి చెప్పారు. మూడు సంవత్సరాల వరకు ఎవరూ వివాహం చేయకూడదని పోలీసులు ఇరువర్గాల పెద్దల అంగీకారంతో అగ్రిమెంట్‌ రాశారు. మూడు సంవత్సరాల తర్వాత ఆ యువతిని తాను ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుంటానని చెబితే అప్పుడు వివాహం జరిపించాలి. లేదంటే ఎవరంతట వారు ఉండాలని పోలీసులు సూచించారు. అయితే అగ్రిమెంట్‌ను కాదని యువతి తల్లిదండ్రులు సోమవారం ఆమెకు వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణ బుధవారం రాత్రి ఇంట్లో  ఉరివేసుకొని మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు మైనర్‌కు వివాహం చేశారని, తమ కుమారుడి మరణానికి అమ్మాయి తల్లిదండ్రులే  కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement