వచ్చే నెల 8వ తేదీ నాటికి ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మండలాధికారులను ఆదేశించారు.
గ్యాస్ ఏజెన్సీల ద్వారా కంపెనీ కస్టమర్ ఐడీ జనరేటర్ చేయాలన్నారు. అదే విధంగా దీపం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఇంటింటికి సర్వే చేయడం, విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో ప్రణాళికను తయారు చేసుకొని రోజును 14 వేలు చొప్పున సర్వే చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌డీవోలు బాధ్యత వహించి సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో తక్కువగా గ్రౌండింగ్ అవుతున్నాయని, సర్వేను వేగవంతం చేయాలన్నారు. వచ్చే నెల నుంచి ఏజెన్సీ ప్రాంత మండలాలలో కిరోసిన్ సరఫరా ఆగిపోతుందని, సంబంధిత విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ జి.సృజన, జేసీ–2 డి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.