పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
Published Mon, Mar 6 2017 12:33 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
రొళ్ల( మడకశిర) : రొళ్ల మండల పరిధిలోని హేటిహళ్లి సమీపంలో నరసింహమూర్తి (42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అటుగా వెళ్లిన రైతులు మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో రొళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నాగన్న ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అగళి మండలం, ముత్తెపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి గురువారం రాత్రి సీసీగిరిలో జరిగిన డ్రామా చూసేందుకు వెళ్లాడు. శవమై పడి ఉండడాన్ని ఆదివారం కనుగొన్నారు. నరసింహమూర్తి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Advertisement
Advertisement