అన్నమే అతని ప్రాణాన్ని తీసింది! | man died while eating food | Sakshi
Sakshi News home page

అన్నమే అతని ప్రాణాన్ని తీసింది!

Published Fri, Feb 12 2016 7:58 PM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

అన్నమే అతని ప్రాణాన్ని తీసింది!

అన్నమే అతని ప్రాణాన్ని తీసింది!

మదంపల్లి (నల్లగొండ): బంధువుల ఇంట్లో విందు ఉందని పిలిస్తే వెళ్లాడు. విందు భోజనమని తొందరతొందరగా తిన్నాడో.. లేక ముద్ద గొంతు దిగలేదో కానీ.. తినే అన్నమే ఆయన ప్రాణాన్ని తీసింది. అన్నం గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడలేదు. విందుకొచ్చిన బంధువులందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు.

ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా మదంపల్లి మండలం గొలబండకంద గ్రామంలో చోటుచేసుకుంది. గొర్రెల కాపరి అయిన బాలోతు చినపీట్ల నాయక్‌ బంధువుల ఇంట్లో అన్నం తింటూ ప్రాణం వదిలాడు. అన్నం గొంతులో ఇరుక్కుపోవడంతో తుదిశ్వాస విడిచాడు. చినపీట్ల నాయక్‌కు భార్య, కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement