యాడికి : బంధువుల వివాహానికి వెళ్లి గుండెపోటుకు గురై మండలంలోని పిన్నేపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు(38) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని పిన్నేపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు అనే వ్యక్తి బంధువుల వివాహానికి శుక్రవారం కర్నూలుకి వెళ్లాడు. అక్కడ గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం పిన్నేపల్లికి తీసుకువచ్చారు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు.