
రైలులోంచి పడి యువకుడి మృతి
తాడిపత్రి రూరల్ : కదులుతున్న రైలులోంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గుంతకల్లు పట్టణంలోని పోర్టర్‌లైన్‌కు చెందిన అంబ్రోస్ జోసఫ్ (20) డ్రమ్స్ కొట్టేందుకు తాడిపత్రికి వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో ముంబై- చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. రైలు కదులుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో జోసఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.