అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | man suicides of financial problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Published Tue, Oct 4 2016 11:46 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

man suicides of financial problems

కదిరి : మున్సిపల్‌ పరిధిలోని ఇందిరాకాలనీలో కాపురముంటున్న వాచ్‌మెన్‌ ఓదులపల్లి క్రిష్ణమార్తి(58) మంగళవారం కాలనీకి సమీపంలోని దయ్యాలతోపులో చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం.. క్రిష్ణమూర్తి స్వగ్రామం నల్లమాడ మండలం చారుపల్లి. పొట్టకూటికోసం 20 ఏళ్లక్రితం భార్యాపిల్లలతో ఈయన కదిరికి కాపురం వచ్చారు. ఆయనకు భార్య సునందమ్మ, ఇద్దరు కొడుకులున్నారు.

ఇతను పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లదగ్గర వాచ్‌మెన్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవలే పెద్ద కొడుకు హేమంత్‌కు బెంగుళూరులో బార్బర్‌షాప్‌ ఏర్పాటు చేయించేందుకు కదిరి ప్రాంతంలో పలువురి దగ్గర సుమారు రూ.4 లక్షలు అప్పు  చేశాడు. చిన్న కొడుకు కార్తీక్‌ పేపర్‌బాయ్‌గా చేస్తూ కదిరిలో ఇంటర్‌ చదువుతూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు.  అప్పు  తీర్చేమార్గం కానరాక సోమవారం రాత్రి  లుంగీతోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement