బెళుగుప్ప (ఉరవకొండ) : మండలంలోని విరుపాపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగభూషణం(32) కడుపునొప్పి తాళలేక ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ నాగస్వామి వివరాల మేరకు.. నాగభూషణం కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి అతడిని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య ధనలక్ష్మి, నాలుగు సంవత్సరాల వయస్సున్న కూతురు మహాలక్ష్మి ఉంది. అతడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.