పోలీసుల అదుపులో మావోయిస్టులు
Published Thu, Aug 11 2016 8:39 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
కర్నూలు టౌన్: కూలీలుగా పని చేస్తున్న చోటు నుంచి పేలుడు పదార్థాలు తీసుకెళ్లి.. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న నలుగురు మావోయిస్టులను కర్నూలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఛత్తిస్‌గఢ్ సుకుమ జిల్లా చిన్‌గఢ్ మండలం పెద్దపార గ్రామానికి చెందిన నలుగురు జిల్లాలోని మెట్టుపల్లి వద్ద జరుగుతున్న టన్నల్ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. టన్నల్‌లో పేలుళ్ల కోసం వినియోగించే జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్‌లను దొంగలించి సుకుమా జిల్లాలో పలు విధ్వంసాలకు పాల్పడ్డారు.
అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఛత్తిస్‌గఢ్ పోలీసులు కర్నూలు ఎస్పీ ఆకె రవికృష్ణకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి జిల్లా పోలీసులు నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మావోయిస్టులు లక్క లక్ష్మీ, భీమా కనాసి, హిడ్మా కార్బాని, కట్టడి ఉంగ్మా గా గుర్తించారు.
Advertisement
Advertisement