‘అల్లుడే మా అమ్మాయిని చంపాడు’ | Married woman suspicious death in guntur district | Sakshi
Sakshi News home page

‘అల్లుడే మా అమ్మాయిని చంపాడు’

Published Wed, Apr 19 2017 7:17 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Married woman suspicious death in guntur district

మాచవరం: గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గ్రామానికి చెందిన సాయికృష్ణ, రజని(21)అనే జంటకు ఏడాది క్రితం వివాహమైంది. తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే  చనిపోయింది. ఆమె మృతికి అల్లుడే కారణమని రజని తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానంతోనే కొట్టి చంపాడని ఆరోపించారు. అయితే, రజనికి తీవ్ర గుండెపోటు వచ్చిందని, నరసరావుపేట ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయిందని భర్త అంటున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement